Patanjali Launches Ayurvedic COVID-19 Medicine (Photo Credits: ANI)

Haridwar, June 23: కరోనా వైరస్ నుంచి విముక్తి కల్పించే మందును బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థ తయారుచేసి విడుదల (Patanjali Launches Ayurvedic COVID-19 Medicine) చేసింది. తాము తయారు చేసిన కోరోనిల్ (Coronil) వాడితే రెండు వారాల్లో కరోనానుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటారని రాందేవ్ బాబా తెలిపారు. 150కి పైగా ఔషద మొక్కలను వాడినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది. COVIFOR Injection: కరోనా పని ఖతం అయినట్లేనా, కోవిఫర్ ఇంజక్షన్‌కు డిసిజిఐ అనుమతి, 100 మిల్లీగ్రాముల ఇంజెక్ష‌న్‌ ఖరీదు రూ.5000 నుంచి రూ.6000 మధ్య ఉండే అవకాశం

రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు. క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని చెప్పారు. తమ మందు వాడిన రోగులు అందరూ వంద శాతం కోలుకున్నారని రాందేవ్ చెప్పారు.

‘కోరోనిల్’పేరుతో తయారుచేసిన ఔషదాన్ని మంగళవారం హరిద్వార్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాందేవ్ బాబా,(Baba Ramdev) పతంజలి సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమ సంస్థ తయారుచేసిన ఔషధం కోవిడ్-19కు చికిత్సలో ఉపయోగపడుతుందని పతంజలి కార్యనిర్వహణాధికారి ఆచార్య బాలకృష్ణ అన్నారు. కోవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవి-2 వైరస్‌ను తాము తయారుచేసిన కరోనిల్ సమర్ధంగా ఎదుర్కొంటుందని పరిశోధనలతో తేలిందన్నారు.

Here's Tweet

అశ్వగంధ, గిలోయ్, తులసితో కలిపి కరోనిల్‌ను కరోనా బాధితులకు చికిత్సలో వినియోగించినప్పుడు 100 శాతం మంది కోలుకున్నారని బాబా రాందేవ్ తెలిపారు. పతంజలి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా రూపొందించినట్టు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ (Clinical Trial) కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ మందును తీసుకొచ్చామని ఆయన వివరించారు. మూడు రోజుల్లో ఈ మందుతో చాలా మంది కోలుకున్నారని చెప్పారు. ఈ మందును తీసుకురావడంతో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు, దేశ వ్యాప్తంగా 4,40,215కి చేరిన కేసులు సంఖ్య, ప్రపంచ వ్యాప్తంగా 91 లక్షలు దాటిన కేసులు

ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో కరోనాకు మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు. హరిద్వార్‌లోని దివ్వ ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ప్రస్తుతం ఈ మందు ఉత్పత్తిని ప్రారంభించాయన్నారు. ప్రాణాంతక కోవిడ్ అంటువ్యాధికి ఇతర సంస్థల కంటే ముందుగా సాక్ష్యం ఆధారిత ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేసి ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందని ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యానించారు.