COVIFOR Injection (Photo-Twitter)

Hyderabad, June 21: కరోనా వైరస్‌కు డ్రగ్ (Coronavirus Drug) కనిపెట్టామని హైదరాబాద్ హెటిరో యాజమాన్యం (hetero pharma) తెలిపింది. ‘కోవిఫర్’ (COVIFOR) పేరుతో జనరిక్ మందు అమ్మకానికి డిసిజిఐ అనుమతి (DCGI Approval) ఇచ్చిందని హెటిరో వెల్లడించింది. వెంటనే ‘కోవిఫర్’ మెడిసన్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కోవిడ్ అనుమానితులు, పాజిటివ్ రోగులు గుర్తించ‌బ‌డిన చిన్నారులు, యువత కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రి పాలైన వారి కోసం కోవిఫ‌ర్ అనే మెడిసిన్ సిద్ధమైందని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ డాక్ట‌ర్ బి.పార్థ‌సార‌థి రెడ్డి తెలిపారు. ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు, భారత్‌లో కరోనా విశ్వరూపం, దేశ వ్యాప్తంగా 4,25,282 కోవిడ్-19 కేసులు, 13,699 మంది మృతి

రెమ్డిసివిర్‌ (Remdesivir)అనే పేరుతో తయారు చేసినా.. `కోవిఫర్‌` అనే పేరుతో మార్కెట్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. 100 మిల్లీగ్రాముల వ‌య‌ల్ (COVIFOR Injection) రూపంలో అందుబాటులో ఉంటుందన్నారు. దీనిని అన్ని వయసుల వారికి వినియోగించవచ్చని సంస్థ పేర్కొన్నది. రోగి ఏ స్థితిలో ఉన్నా దీనిని వాడవచ్చని తెలిపింది. ఒక రోగికి ఎన్ని డోసులు ఇవ్వాలన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పింది. అయితే ఒక రోగికి 5-6 డోసులు ఇవ్వాల్సి రావొచ్చని సంస్థ అంచనా వేస్తున్నది. ఉత్ప‌త్తి, మార్కెటింగ్ కోసం డ్ర‌గ్ కంట్రోల‌ర్ జన‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి కూడా పొందిన‌ట్లు వెల్ల‌డించింది. గిలిడ్ సైన్సెస్ ఐఎన్‌సీతో కుదుర్చుకున్న‌ లైసెన్స్ ఒప్పందాన్ని అనుస‌రించి ఈ ఉత్ప‌త్తిని అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామని ఆయన అన్నారు. తూచ్..అంతా ఫేక్, మరోసారి తప్పు చెప్పిన మాయన్ క్యాలెండర్, జూన్ 21 యుగాంతం అనేది అంతా అబద్దమే, 2012లో కూడా పుకారు లేపిన మయాన్ క్యాలెండర్

భారత ఫార్మా దిగ్గజం, ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ సంస్థ కూడా కరోనాను నయం చేసేందుకు ట్యాబ్లెట్లు తయారు చేసిన విషయం తెలిసిందే. యాంటివైరల్‌ డ్రగ్‌ ఫవిపిరవిర్‌ను ఫ్యాబిఫ్లూ పేరుతో శనివారం ఆవిష్కరించింది. ఫ్యాబీఫ్లూ మాత్రల తయారీ, మార్కెటింగ్‌ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నుంచి ఇప్పటికే తమకు అనుమతులు లభించినట్లు గ్లెన్‌మార్క్‌ వెల్లడించింది. భారత్‌లో కొవిడ్‌ చికిత్సలో మాత్రలకు అనుమతులు పొందిన తొలి సంస్థ గ్లెన్‌మార్క్‌ కావడం విశేషం. శనివారం ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొవిడ్‌-19 స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న రోగులపై ఫ్యాబిఫ్లూ మాత్రలు బాగా పనిచేస్తాయి.

కొవిఫర్‌ను చికిత్స పొందుతున్న రోగులకు వైద్యుల పర్యవేక్షణలో అందించాల్సి ఉంటుందని హెటిరో సంస్థ తెలిపింది. ఇది బయట మందుల దుకాణాల్లో దొరుకదని స్పష్టంచేసింది. ప్రస్తుతం కొవిఫర్‌ను ప్రభుత్వం ద్వారా నేరుగా కరోనా చికిత్స అందిస్తున్న దవాఖానలకే సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని హెటిరో ప్లాంట్లలో కొవిఫర్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రభుత్వం కోరినన్ని డోసులు సరఫరాచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సంస్థ తెలిపింది. ధరను ఇంకా ఖరారు చేయలేదన్నది. ఒక్కో వయల్‌కు రూ.5000 నుంచి రూ.6000 మధ్య ఉండొచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నాయి.

1837945