COVID-19 Outbreak in India | File Photo

New Delhi, June 22: భారత్‌లో రోజు రోజుకీ కోవిడ్‌–19 కేసుల సంఖ్య (India Coronavirus) పెరిగిపోతోంది. ఒక్కరోజులోనే 15వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాటిజివ్‌ కేసుల సంఖ్య 4 లక్షల 25వేల మార్క్‌ను దాటింది. ఇప్పటివరకూ భారత్‌లో 4,25,282 కరోనా కేసులు (COVID-19 Cases) నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 14,821 కొత్త కేసులు నమోదు కాగా, 445మంది మృతి చెందారు. ఇక యాక్టివ్‌ కేసులు 1,74,387 ఉండగా, 2,37,196మంది మహమ్మారి నుంచి కోరుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ వైరస్‌ బారినపడి 13,699మంది ప్రాణాలు కోల్పోయారు. ఇకపై పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ, హ్యాపీ సమ్మర్ సీజన్ 2020 వచ్చేసింది, జూన్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న సమ్మర్ సీజన్

మరోవైపు మహారాష్ట్రతో (Coronavirus Cases in Maharashtra) పాటు దేశ రాజధాని ఢిల్లీని కూడా కరోనా గడగడలాడిస్తోంది. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ​కాగా భారత్‌లో మరో పది రోజుల్లోనే రెండు లక్షల కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటేస్తుందని అమెరికాకు చెందిన మిషిగాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అంచనా వేశారు. భారత్‌లో మరిన్ని కోవిడ్‌–19 వైద్య పరీక్షలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘భారత్‌ జనాభాలో 0.5 శాతానికే పరీక్షలు నిర్వహించారు. అదే మిగిలిన ప్రపంచ దేశాలు కరోనా విస్తృతి అధికంగా చేరుకున్న నాటికి జనాభాలో 4 శాతం మందికి పరీక్షలు నిర్వహించారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత నాలుగైదు వారాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతా యి. భారత్‌లో కూడా అదే జరుగుతోంది. ఈ రోజుకు ఎన్నో ప్రత్యేకతలు! ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఒకేసారి మోసుకొచ్చిన 2020 సంవత్సరపు జూన్ 21, నేటి తేదీతో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్యమైన దినోత్సవాలను తెలుసుకోండి

దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,32,075 కరోనా కేసులు నమోదవగా, 6170 మంది మరణించారు. ఢిల్లీలో 59,746 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2175 మంది మృతిచెందారు. తమిళనాడులో ఇప్పటివరకు 59,377 కేసులు నమోదవగా, 757 మంది చనిపోయారు. గుజరాత్‌లో 27,260 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1663 మంది మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌లో 17,731 మంది కరోనా బారినపడగా, 550 మంది బాధితులు మరణించారు.

నాలుగైదు రోజులుగా రోజుకి 12 వేలకు పైగా కేసులు (New COVID-19 Cases) నమోదవుతూ ఉండడంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా నాలుగు లక్షలు దాటేసింది.3 నుంచి 4 లక్షలకు కేసులు చేరుకోవడానికి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పట్టింది. దేశంలో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 143 రోజుల్లో 4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 75% కేసులు గత నెలరోజుల్లోనే అంటే, మే 19 నుంచి జూన్‌ 20 మధ్య నమోదయ్యాయి. రికవరీ రేటు ఒక్కటే భారత్‌కు భారీగా ఊరటనిస్తోంది. ఇప్పటికే 2.27 లక్షల మంది రోగులు కోలుకున్నారు. రికవరీ రేటు 55.48శాతంగా ఉంది.

భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30న మొదలైన దగ్గర్నుంచి వంద కేసులు చేరుకోవడానికి 43 రోజులు పడితే వంద కేసుల నుంచి లక్ష చేరుకోవడానికి 64 రోజులు పట్టింది. అప్పట్నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మరో లక్ష కేసులు 15 రోజుల్లోనే నమోదైతే, 3 లక్షలు చేరుకోవడానికి ఇంకో 10 రోజులే పట్టింది. 3 నుంచి 4 లక్షలు కేవలం ఎనిమిది రోజుల్లోనే దాటేసింది.

మూడు రాష్ట్రాల నుంచే 60% కేసులు

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 60శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ నుంచే వస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాలు కరోనా గుప్పిట్లో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి. మహారాష్ట్రలో లక్షా 28 వేల 205 కేసులు నమోదైతే ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (56,845), ఢిల్లీ (56,746), గుజరాత్‌ (26,680), ఉత్తరప్రదేశ్‌ (16,594) రాష్ట్రాలున్నాయి. ఇక దేశవ్యాప్తంగా సంభవించిన 13,254 కోవిడ్‌ మృతుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 5,984 నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ (2,112), గుజరాత్‌ (1,638), తమిళనాడు (704) ఉన్నాయి.