June 21 Save The Date: ఈ రోజుకు ఎన్నో ప్రత్యేకతలు! ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఒకేసారి మోసుకొచ్చిన 2020 సంవత్సరపు జూన్ 21, నేటి తేదీతో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్యమైన దినోత్సవాలను తెలుసుకోండి
June 21 - Image used for representational purpose only. | Image Credits: Pixabay

New Delhi, June 21:  ఈ ఏడాది జూన్ 21, ఆదివారం అనేక సంఘటనల సంగమంతో వచ్చింది, వాటిలో ఖగోళంలో అరుదుగా సంభవించే సూర్యగ్రహణం "రింగ్ ఆఫ్ ఫైర్" ఏర్పడుతోంది. ఈ సంఘటనతో అనేక సామాజిక, మత, ఖగోళ మరియు జ్యోతిషశాస్త్ర సంఘటనలు ముడిపడి ఉన్నాయి. దాని ప్రకారం వేర్వేరు ప్రాంతాల్లో వేరువేరుగా అనేక కార్యక్రమాలు, తంతులు ఈరోజు జరగనున్నాయి.

అంతేకాకుండా 'హ్యాప్పీ సమ్మర్' గా పిలవబడే సీజన్ కూడా జూన్ 21 నుంచే ప్రారంభమవుతుంది. అంటే ఈరోజు నుంచి పగటి పూట కాలం ఎక్కువగా ఉండనుంది. భూమి యొక్క రెండు ధ్రువాలలో సూర్యుని వైపుకు గరిష్టంగా వంపు ఉండే ధ్రువం వైపు వెచ్చని వేసవి కాలం సంభవిస్తుంది. ఇది ప్రతి అర్ధగోళంలో ఒకసారి సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. ఖగోళ ధృక్పథం ప్రకారం భూమికి ఉన్న ధ్రువాలను బట్టి ఉత్తర అర్ధగోళం మరియు దక్షిణ అర్ధగోళంగా విభజించి వాతావరణ పరిస్థితులు, ఇతర భౌగోళీక అంచనాలు వేస్తారు.

ఈ నేపథ్యంలో భారతదేశం సహా ఉత్తర అర్ధగోళం పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నీ జూన్ 21 ఆదివారం నాడు ఈ ఏడాదిలోనే అతి పొడవైన పగటి రోజును చూసేందుకు సాక్షిభూతంగా నిలవనున్నాయి.

వీటితో పాటు ఎన్నో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రోజులు ఈరోజు వేడుక చేసుకోబోతున్నాయి. ప్రపంచ యోగా దినోత్సవం, ఫాదర్స్ డే, ప్రపంచ సంగీత దినోత్సవం, టీషర్ట్ దినోత్సవం, షేక్ హ్యాండ్ డే, హైడ్రోగ్రఫీ డే, హ్యుమనిస్ట్ డే ఇలా 7 అంతర్జాతీయ దినోత్సవాలకు 2020, జూన్ 21 వేదికైంది.

ప్రతీ ఏడాది జూన్ లోని 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా జరపబడుతుంది. ఈ ఏడాది జూన్ 21న వచ్చింది.  ఇక జూన్ 21న షేక్ హ్యాండ్స్ డే కూడా అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో షేక్ హ్యాండ్స్ డేకు ఈ ఏడాది నమస్కారం పలుకుతున్నారు.

అంతేకాకుండా మయన్ క్యాలెండర్ లో జూన్ 21న ప్రపంచం నాశనం అవుతుందని చెప్పబడింది. అందుకే ఈరోజును 'డూమ్స్ డే' గా కూడా పిలుస్తారు. దీంతో ప్రతీ ఏడాది జూన్ 21ని ప్రపంచం అంఅతమయ్యే రోజంటూ ఎక్కడో ఓ మూలన విపరీతంగా చర్చ జరుగుతుంటుంది.

భారతదేశంలో ప్రాణం పోసుకున్న యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఏడాదిలో ఒక రోజును అంతర్జాతీయ దినోత్సవంగా జరపబడాలని ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించారు. అలా ప్రతిపాదించిన కొన్ని నెలల తర్వాత 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి తన సర్వసభ్య సమావేశంలో జూన్ 21ను 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' గా ప్రకటించింది. అప్పట్నించి భారత్ యోగా దినోత్సవాన్ని ప్రముఖంగా నిర్వహిస్తూ వస్తుంది.