Kaaba in Mecca's Grand Mosque. (Photo Credits: AFP)

New Delhi, June 23: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్(Global Coronavirus) కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో (India Coronavirus) అయితే ఇది విశ్వరూపం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భార‌త్ నుంచి హ‌జ్ యాత్ర‌కు (Haj 2020 Update) వెళ్లే వారికి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ తెలిపారు. దేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు, దేశ వ్యాప్తంగా 4,40,215కి చేరిన కేసులు సంఖ్య, ప్రపంచ వ్యాప్తంగా 91 లక్షలు దాటిన కేసులు

కోవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్నందున 2020 హ‌జ్ యాత్ర‌కు భార‌తీయుల‌ను పంప‌డం లేద‌ని మంత్రి చెప్పారు. ఈ ఏడాది హ‌జ్ యాత్రం కోసం దాదాపు 2.3 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. వారి డ‌బ్బును తిరిగి చెల్లించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఆ డ‌బ్బును నేరుగా ద‌ర‌ఖాస్తుదారుడి ఖాతాల్లోకి పంప‌నున్న‌ట్లు న‌ఖ్వీ వెల్ల‌డించారు.

కాగా క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఇత‌ర దేశాల నుంచి వ‌స్తున్న యాత్రికుల‌కు ఈ సారి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని కూడా సౌదీ అరేబియా ప్ర‌క‌టించింది.

Here's What Mukhtar Abbas Naqvi said:

మాక్కాను విజిట్ చేసేందుకు కేవ‌లం కొద్ది మంది సౌదీ నివాసితుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు సౌదీ ప్ర‌భుత్వం సోమ‌వారం స్ప‌ష్టం చేసింది. సోష‌ల్ డిస్టాన్సింగ్ సూత్రాల‌కు అనుగుణంగా హజ్ యాత్ర ఉంటుంద‌ని పేర్కొన్న‌ది.ఈ మేరకు సౌదీకి చెందిన హ‌జ్ అండ్ ఉమ్రా మంత్రిత్వ‌శాఖ ఈ ప్ర‌క‌ట‌న చేసింది.