COVID19 in India: భారత్లో ఒక్కరోజులోనే అత్యధికంగా సుమారు 5 వేల పాజిటివ్ కేసులు నమోదు, దేశంలో 90 వేలు దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, 3 వేలకు చేరువలో కరోనా మరణాలు
ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న మూడవ విడత లాక్డౌన్ నేటితో ముగియనుంది. రేపు మే 18 నుంచి దేశంలో లాక్డౌన్-4 అమలులోకి రాబోతుంది. ఇప్పటివరకు విధించిన లాక్డౌన్లకు భిన్నంగా ఈ లాక్డౌన్ ఉండబోతుందని....
New Delhi, May 17: భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 90 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 4,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 90,927 కు చేరింది. నిన్న ఒక్కరోజే 120 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,872కు పెరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ చివరి విడత ప్రకటనలు ఆదివారం 11 గంటల నుంచి వివరించనున్న నిర్మల సీతారామన్
నిన్న దేశవ్యాప్తంగా 3956 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 34,108 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 53,946 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రాల వారీగా కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
S. No. | Name of State / UT | Total Confirmed cases* | Cured/Discharged/Migrated | Deaths** |
---|---|---|---|---|
1 | Andaman and Nicobar Islands | 33 | 33 | 0 |
2 | Andhra Pradesh | 2355 | 1353 | 49 |
3 | Arunachal Pradesh | 1 | 1 | 0 |
4 | Assam | 92 | 41 | 2 |
5 | Bihar | 1179 | 453 | 7 |
6 | Chandigarh | 191 | 51 | 3 |
7 | Chhattisgarh | 67 | 56 | 0 |
8 | Dadar Nagar Haveli | 1 | 0 | 0 |
9 | Delhi | 9333 | 3926 | 129 |
10 | Goa | 17 | 7 | 0 |
11 | Gujarat | 10988 | 4308 | 625 |
12 | Haryana | 887 | 514 | 13 |
13 | Himachal Pradesh | 78 | 43 | 3 |
14 | Jammu and Kashmir | 1121 | 542 | 12 |
15 | Jharkhand | 217 | 113 | 3 |
16 | Karnataka | 1092 | 496 | 36 |
17 | Kerala | 587 | 495 | 4 |
18 | Ladakh | 43 | 22 | 0 |
19 | Madhya Pradesh | 4789 | 2315 | 243 |
20 | Maharashtra | 30706 | 7088 | 1135 |
21 | Manipur | 7 | 2 | 0 |
22 | Meghalaya | 13 | 11 | 1 |
23 | Mizoram | 1 | 1 | 0 |
24 | Odisha | 737 | 196 | 3 |
25 | Puducherry | 13 | 9 | 1 |
26 | Punjab | 1946 | 1257 | 32 |
27 | Rajasthan | 4960 | 2839 | 126 |
28 | Tamil Nadu | 10585 | 3538 | 74 |
29 | Telengana | 1509 | 971 | 34 |
30 | Tripura | 167 | 64 | 0 |
31 | Uttarakhand | 88 | 51 | 1 |
32 | Uttar Pradesh | 4258 | 2441 | 104 |
33 | West Bengal | 2576 | 872 | 232 |
Cases being reassigned to states | 290 | |||
Total number of confirmed cases in India | 90927# | 34109 | 2872 |
భారతదేశంలో కోవిడ్-19 తీవ్రత అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసులో 1/3 వంతు మహారాష్ట్రలో నమోదైనవే. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య ఇప్పటికే 30 వేలు దాటగా, ఒక్క ముంబై నగరంలోనే కేసులు 19 వేలకు చేరువై, 20 వేల దిశగా వెళ్తున్నాయి. మరణాల సంఖ్య కూడా ఈ రాష్ట్రం నుంచే అత్యధికంగా 1135 కరోనా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత గుజరాత్ (10,988), తమిళనాడు (10,585), దిల్లీ (9333) లలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
Lockdown-4 కు సిద్ధమవండి: పీఎం మోదీ
ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న మూడవ విడత లాక్డౌన్ నేటితో ముగియనుంది. రేపు మే 18 నుంచి దేశంలో లాక్డౌన్-4 అమలులోకి రాబోతుంది. ఇప్పటివరకు విధించిన లాక్డౌన్లకు భిన్నంగా ఈ లాక్డౌన్ ఉండబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో రేపట్నించి అమలులోకి రాబోయే లాక్డౌన్ విధింపులో రాష్ట్రాలకే అధికారం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాలు వారి దగ్గర ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లక్డౌన్ అమలు, ఆంక్షల సడలింపులు ఉండే అవకాశం ఉంది. ఏదైమైనా ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఈరోజు కేంద్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)