New Delhi, May 12: కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి (PM Narendra Modi to address the nation) మాట్లాడారు. లాక్‌డౌన్ 4వ దశ (Lockdown 4.0) ఉంటుందని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు 18వ తేదీకి ముందే ప్రకటిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా (Coronavirus Pandemic) సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
కరోనా మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందని, తమ జీవితంలో ఎవరూ ఇలాంటి ఉపద్రవాన్ని కనీవిని ఎరుగరని మోదీ పేర్కొన్నారు. మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది అన్నారు
4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని, ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని మోదీ చెప్పారు.ఈ సంధర్భంగా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ. 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్ అభియాన్‌పై ఆర్థిక మంత్రి వివరాలు అందిస్తారని తెలిపారు. కొవిడ్ -19 కోసం ప్రభుత్వం చేసిన ప్రకటనలతో పాటు, ఆర్బీఐ నిర్ణయాలు అన్నీ కలుపుకుని ఆ ప్యాకేజీ విలువ సుమారు రూ. 20 లక్షల కోట్లు ఉంటుందన్నారు. మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతమని మోదీ చెప్పారు. 54 వేల టికెట్లను జారీ చేసిన రైల్వే శాఖ, రైల్వే స్టేష్టన్‌లో ఆరోగ్య పరీక్షలు, ప్రతి ప్రయాణీకుల డేటా ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని తెలిపిన DG RPF Arun Kumar
కరోనా ఆపదను ఎదుర్కొనేందుకు జాతి మొత్తం ఒక్కటై నిలబడింది. కరోనా మనకు ఆపదతో పాటు అవకాశాన్ని తెచ్చిపెట్టింది. కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం. మన దగ్గర తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం అని మోదీ అన్నారు.
ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నామని, స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని, అయితే ఈ మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనిషి సిద్ధంగా లేడని అన్నారు. కరోనా వైరస్ ఓ సందేశాన్ని తీసుకువచ్చిందని, బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆ సందేశం అని వెల్లడించారు.