New Delhi, May 12: మే 12 నుంచి 15 ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ రైళ్లను ప్రారంభించనున్నట్లు భారత రైల్వే (Indian Railways) ప్రకటించడంతో, స్టేషన్లలో ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ ( Railway Protection Force Director) జనరల్ మంగళవారం పేర్కొన్నారు. ప్రతి ప్రయాణీకుల డేటా వారి రాష్ట్ర ప్రభుత్వానికి (State Govt) అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రాజధాని రూట్లలో 15 రైళ్లు తిరుగుతాయి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్ల వివరాలు, అలాగే రేపటి నుంచి పట్టాలెక్కే రైళ్ల వివరాలు, బుకింగ్ ప్రాసెస్ మీకోసం
స్టేషన్లలో ప్రయాణీకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడతాయి. స్టేషన్లలో కూలీలు అందుబాటులో లేనందున లగేజి వీలయినంత తక్కువగా తెచ్చుకుని ప్రయాణించాలని మేము వారిని అభ్యర్థించాము. ప్రతి ప్రయాణీకుల డేటాను వారి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని DG RPF Arun Kumar తెలిపారు.
మొత్తం 15 రైళ్ల కోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు ఐఆర్సీటీసీ (IRCTC) ద్వారా బుకింగ్‌కు అవకాశం కల్పించారు. అయితే సోమవారం ఒక్క రోజే ఆ ప్రత్యేక ఏసీ రైళ్ల కోసం 54వేల మందికి టికెట్లు జారీ చేసినట్లు భారతీయ రైల్వే పేర్కొన్నది. నిన్న రాత్రి 9.15 నిమిషాల వరకు సుమారు 30 వేల పీఎన్ఆర్‌లు జనరేట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Here's what Arun Kumar said:
Health screening of passengers will be conducted at the stations. We have also requested them to travel light as no coolies are available at stations. We will be handing over the data of each and every passenger to their state government: Arun Kumar, DG Railway Protection Force pic.twitter.com/0jMI6sbL88
— ANI (@ANI) May 12, 2020
మొత్తం మీద 54 వేల మంది ప్రయాణికులకు టికెట్లు ఇచ్చారు. ప్రత్యేక ఏసీ రైళ్లతో పాటు ఇప్పటికే వందల సంఖ్యలో శ్రామిక్ రైళ్లను కూడా రైల్వేశాఖ నడుపుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేక ఏసీ రైళ్ల కోసం ఆర్ఏసీ కానీ, వెయిటింగ్ లిస్టు కానీ ఇవ్వలేదు. ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని తెచ్చుకోవాలి. ప్రత్యేక రైళ్లలో వెళ్తున్న ప్రయాణికులందరూ తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతను యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Timing of Special Trains Here:
Passenger services on Indian Railways shall be partially restored w.e.f. from 12th May 2020 in a graded manner. 15 pairs of special trains shall be operated to 15 cities. Only online E-Ticketing will be done through IRCTC website. See attached list.https://t.co/HSfscqd7GQ pic.twitter.com/fUjBiTndDj
— Ministry of Railways (@RailMinIndia) May 11, 2020
లాక్‌డౌన్ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లలోనూ కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ కొన్ని కేటగిరీలకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. మొదట ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వమని ప్రకటించిన రైల్వే శాఖ పునరాలోచించి విద్యార్థులు, దివ్యాంగులు, 11 రకాల రోగులకు ప్రత్యేక రైళ్లలోనూ రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రైలు ప్రయాణాలు ఎక్కువ చేయకుండా మూడు కేటగిరీలకు తప్ప ఇతరులకు రైల్వే టికెట్లలో రాయితీలు ఇవ్వకూడదని రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశించింది. శ్రామిక్ స్పెషల్ రైళ్లపై రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలు, ఇకపై 1700 మంది వలస కార్మికులను తీసుకెళ్లనున్న స్పెషల్ రైళ్లు, గమ్యస్థానానికి చేరిన 363 రైళ్లు
లాక్ డౌన్ సందర్భంగా రెండు నెలలుగా రైళ్ల రాకపోకలను నిలిపివేసిన కేంద్రం మే 12 నుంచి 15 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ నుంచి డిబ్రూఘడ్, అగర్తలా, హౌరా, పట్నా, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్ గామ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీలకు ప్రత్యేక రైళ్లు నడపుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలోనూ మూడు కేటగిరీల వారికి టికెట్ రాయితీలు ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ తాజాగా ప్రకటించింది.
అంతకుముందు, మే 12 నుండి పనిచేయడం ప్రారంభించే 15 జతల ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ రైళ్ల జాబితాను భారత రైల్వే పంచుకుంది, దీని కోసం టికెట్లను ఆన్‌లైన్‌లో ఐఆర్‌సిటిసి విక్రయిస్తుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు సమానమైన రైళ్లు న్యూ ఢిల్లీ నుంచి దిబ్రుగర్ అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మద్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తారా నగరాలకు ప్రారంభమవుతాయి.