File image of passengers waiting for trains (Photo Credit: PTI)

New Delhi, May 11: దాదాపుగా నెలన్నర తరువాత ప్రయాణికుల రైళ్లు (Trains) తిరిగి పట్టాలకెక్కనున్నాయి. రేపటి నుంచి రైల్వేశాఖ (Indian Railways) త‌న సేవ‌ల‌ను క్ర‌మంగా ప్రారంభించనుంది. ప్రారంభంలో 15 జ‌త‌ల రైళ్లను సాధార‌ణ ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌డానికి ఉప‌యోగించ‌నున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో (Lockdown) గూడ్సు సర్వీసులు మాత్రమే కూతపెట్టగా.. రేపటి నుంచి ప్రయాణికుల రైళ్లు కూడా సేవలందించనున్నాయి. రేపట్నించి తిరిగి ప్రారంభం కానున్న ప్యాసెంజర్ రైలు సర్వీసులు, ఈరోజు నుంచే బుకింగ్స్ ప్రారంభం, ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌కు మాత్రమే అనుమతి

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (IRCTC) లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా రిజర్వేషన్ చేసుకున్న వారు మాత్రమే ప్రయాణించడానికి అవకాశముంటుంది. టిక్కెట్ కన్‌ఫాం అయిన వారు మాత్రమే స్టేషన్‌కు రావాలని.. మిగతావారు ఎవరూ కూడా రైల్వే స్టేషన్లకు రావొద్దని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు 

మే 12 నుంచి బెంగళూరు-న్యూఢిల్లీ రూట్‌లో స్పెషల్ ట్రైన్ నడుస్తుంది. ఈ రైలు ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం జంక్షన్, అనంతపురం, గుంతకల్ జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, కాజిపేట్ జంక్షన్‌లలో ఈ రైళ్లు ఆగుతాయి. మే 13 నుంచి న్యూ ఢిల్లీ-చెన్నై సెంట్రల్‌ రూట్‌లో ప్రతీ బుధవారం, శుక్రవారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు విజయవాడ, వరంగల్‌లో ఆగుతాయి. మే 17 నుంచి న్యూ ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ ఆదివారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో కాజిపేట జంక్షన్‌లో ఆగుతాయి.  శ్రామిక్ స్పెషల్ రైళ్లపై రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలు, ఇకపై 1700 మంది వలస కార్మికులను తీసుకెళ్లనున్న స్పెషల్ రైళ్లు, గమ్యస్థానానికి చేరిన 363 రైళ్లు

రేపటి నుంచి ప్రారంభం కానున్న రైళ్లు వివరాలు

1.న్యూఢిల్లీ నుంచి డిబ్రుఘడ్

2.న్యూఢిల్లీ నుంచి అగర్తాలా

3.న్యూఢిల్లీ నుంచి హౌరా

4.న్యూఢిల్లీ నుంచి బిలాస్‌పూర్

5.న్యూఢిల్లీ నుంచి పాట్నా

6.న్యూఢిల్లీ నుంచి రాంచి

7.న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్

8.న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్

9.న్యూఢిల్లీ నుంచి బెంగళూరు

10.న్యూఢిల్లీ నుంచి చెన్నై

11.న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం

12.న్యూఢిల్లీ నుంచి మడ్గావ్

13.న్యూఢిల్లీ నుంచి ముంబై సెంట్రల్

14.న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్

15.న్యూఢిల్లీ నుంచి జమ్మూతావీ

MHA Issues SOP For Movement of People by Trains And Rules For Entry to Platform:

కాగా రైల్వే టిక్కెట్టు ధరలను పెంచలేదని, ప్రస్తుతం ఉన్న ధరలతోనే ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ప్రయాణానికి ఒక గంట ముందే ప్రయాణికులు స్టేషన్‌కు రావాలని కోరారు. స్క్రీనింగ్ పరీక్షల అనంతరం నెగెటివ్ అని తేలితేనే ప్రయాణానికి అనుమతినిస్తామని, లేదంటే వెనక్కి పంపిస్తామని అధికారులు వెల్లడించారు.ప్రయాణికులందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ప్రతీ కోచ్‌లో 72 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు.  విద్యుత్ శాఖ‌ ఉద్యోగికి కరోనా, ఢిల్లీలో మూత‌పడిన శ్ర‌మ‌శ‌క్తి భ‌వ‌న్, త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్

స్టేషన్‌లలో టిక్కెట్లను విక్రయించమని, కేవలం ఆన్‌లైన్ రిజర్వేషన్ మాత్రమే చేయించుకోవాలన్నారు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ వంటి సేవలు ప్రస్తుతం అందుబాటులోకి తేవడం లేదన్నారు. సోమవారం సాయంత్రం 4గంటల నుంచి రిజర్వేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.రైల్వే స్టేష‌న్‌లో టికెట్ బుకింగ్ కౌంట‌ర్లు మూసి ఉంటాయి. ప్లాట్‌ఫాం టికెట్లు కూడా ఇవ్వ‌రు. చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్న ప్ర‌యాణికుల‌ను మాత్ర‌మే రైల్వే స్టేష‌న్‌లోకి అనుమ‌తి ఇస్తారు.

మొదటగా ఈ 15 రైళ్లను ప్రారంభిస్తామని.. ఆ తరువాత మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం దాదాపుగా 20వేల రైల్వేకోచ్‌లను కోవిడ్-19 బాధితులకోసం వినియోగిస్తున్నామని, అలాగే 300 రైళ్లను వలస కార్మికుల కోసం నడుపుతున్నామన్నారు.