New Delhi, May 11: కోవిడ్ 19 (COVID 19) వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనల మేరకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ (Shram Shakti Bhawan Sealed) మూతపడింది. శ్రమశక్తి భవన్‌లో కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన కార్యాలయం ఉన్నది. ఈ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో శ్రమ శక్తి భవన్‌ను (Shram Shakti Bhawan in Delhi) పూర్తిగా మూసివేశారు. ఆ బిల్డింగ్‌లో పనిచేసి ఇతర ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేయాలని ఆదేశించారు. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలని సూచించారు. కరోనాతో 2206 మంది మృతి, దేశ వ్యాప్తంగా 67,152కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 44,029 కేసులు, నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
గత వారంలో ఢిల్లీలోని న్యాయ వ్యవహారాల శాఖ శాస్త్రి భవన్ కార్యాలయానికి సీలు వేశారు. అక్కడ ఓ సీనియర్ అధికారికి కోవిడ్ -19 పరీక్షల్లో పాజిటివ్ రావడంతో భవనం మూసివేయబడింది. ANI చేసిన ట్వీట్ ప్రకారం, ఒక సీనియర్ అధికారి మే 1 న కరోనావైరస్ టెస్ట్ నిర్వహించారు. ఆ అధికారి చివరిసారిగా ఏప్రిల్ 23 న తన కార్యాలయాన్ని సందర్శించారు. ముందు జాగ్రత్త చర్యగా శాస్త్రి భవన్ కార్యాలయానికి సీలు వేయబడిందని తెలిపింది.
Here's the tweet:
Delhi: Shram Shakti Bhawan has been sealed as per protocol, after an employee in the Ministry of Power, whose office is the building tested positive for #COVID19. All employees has been advised to work from home, till further notice. pic.twitter.com/eq6UScvxgD
— ANI (@ANI) May 11, 2020
ఢిల్లీలో, COVID-19 సంఖ్య ఇప్పటివరకు 6,923 కు పెరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో సోమవారం దేశంలో మొత్తం COVID-19 కేసులు 67,152 కు పెరిగాయి, వీటిలో 44,029 కేసులు క్రియాశీల కేసులు. మొత్తం కరోనావైరస్ కేసులలో, 20,917 మంది వ్యక్తులు నయమై ఆసుపత్రుల నుండి విడుదల చేయబడ్డారు. మరణాల సంఖ్య 2206 కు పెరిగింది.