PM Modi on Lockdown 4.0: రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
PM Modi on Lockdown Extention (Photo-ANI)

New Delhi, May 12: ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి (PM Narendra Modi to address the nation) ప్రసంగించారు.కరోనా పరిస్థితులు (Coronavirus Pandemic), లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా దీటుగా ఎదుర్కొంటోందని తెలిపారు. 54 వేల టికెట్లను జారీ చేసిన రైల్వే శాఖ, రైల్వే స్టేష్టన్‌లో ఆరోగ్య పరీక్షలు, ప్రతి ప్రయాణీకుల డేటా ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని తెలిపిన DG RPF Arun Kumar

సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదని అన్నారు.ఈ విపత్కర సమయంలో భారత్ సామర్థాన్ని తక్కిన ప్రపంచం కూడా నమ్ముతోందని, భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయని తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరుతో రూ. 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని  ప్రధాని మోదీ ప్రకటించారు. రేపట్నుంచి ఆత్మ నిర్భర్‌ అభియాన్‌పై ఆర్థిక మంత్రి వివరాలు అందిస్తారని తెలిపారు. కొవిడ్ -19 కోసం ప్రభుత్వం చేసిన ప్రకటనలతో పాటు, ఆర్బీఐ నిర్ణయాలు అన్నీ కలుపుకుని ఆ ప్యాకేజీ విలువ సుమారు రూ. 20 లక్షల కోట్లు ఉంటుందన్నారు. మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతమని మోదీ చెప్పారు.

భారత్‌ సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడి, రైతు జేబులోకి నేరుగా వెళ్తుందన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం వస్తుందన్నారు. దేశంలోని ప్రతి పారిశ్రామికుడిని కలుపుకుని పోయేలా ప్యాకేజీ ఉంటుందని మోదీ పేర్కొన్నారు. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుందని మోదీ అన్నారు.  ఈ రాజధాని రూట్లలో 15 రైళ్లు తిరుగుతాయి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్ల వివరాలు, అలాగే రేపటి నుంచి పట్టాలెక్కే రైళ్ల వివరాలు, బుకింగ్ ప్రాసెస్ మీకోసం

ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చిందని, నాడు 2000 సంవత్సరంలో వై2కే సమస్య ఉత్పన్నమైతే యావత్ కంప్యూటర్ ప్రపంచం తల్లడిల్లిపోయిన వేళ భారత నిపుణులు నిబ్బరంగా సమస్యను ఎదుర్కొన్నారని, ప్రపంచానికి దిశా నిర్దేశం చేశారని ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నామని, స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని, అయితే ఈ మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనిషి సిద్ధంగా లేడని అన్నారు. కరోనా వైరస్ ఓ సందేశాన్ని తీసుకువచ్చిందని, బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆ సందేశం అని వెల్లడించారు. ముంబై ధారావిని తలపిస్తోన్న చెన్నై కన్నాగి నగర్‌, ఒక్క రోజే 23 కోవిడ్-19 కేసులు నమోదు, తమిళనాడులో 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు

4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని, ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని మోదీ చెప్పారు. ఒక్క వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోందని, ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 2 లక్షల 88 వేల మంది కరోనా కారణంగా చనిపోయారని మోదీ గుర్తుచేశారు. ఓడిపోవడం, కుంగిపోవడం మానవాళికి ఇష్టం లేదని, మరింత ధృడ సంకల్పంతో మనం ముందుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని మోదీ స్పష్టం చేశారు. కరోనాకు ముందుకు కరోనా తర్వాత విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నాలుగు నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని మోదీ తెలిపారు. కరోనాతో పోరాడుతూనే జీవనం కొనసాగించాలని ప్రజలకు ప్రధాని సూచించారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదని మోదీ అన్నారు. ప్రస్తుతం మనం చాలా కీలకమైన దశలో ఉన్నామని ఆయన చెప్పారు. రోజుకు 2 లక్షల చొప్పున పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌ల తయారీ మొదలైనట్లు ప్రధాని తెలిపారు. కాగా ఈ నెల 17తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది.

కరోనా ఆపదను ఎదుర్కొనేందుకు జాతి మొత్తం ఒక్కటై నిలబడింది. కరోనా మనకు ఆపదతో పాటు అవకాశాన్ని తెచ్చిపెట్టింది. కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం. మన దగ్గర తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం అని మోదీ అన్నారు.