Chennai, May 12: కోవిడ్-19 వైరస్‌తో తమిళనాడు (Tamil Nadu Coronavirus) అతలాకుతలమవుతోంది. ఇప్పటికే అక్కడ 8 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు (TN Corona Cases) నమోదు అయ్యాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో (Koyambedu market) చాపకింద నీరులా విస్తరించిన కరోనా వైరస్ తాజాగా స్లమ్ ఏరియా అయిన కన్నాగి నగర్‌కు వ్యాపించింది. నాలుగవ దశ లాక్‌డౌన్, ఈ నెల 15 లోగా రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పాలన్న ప్రధాని మోదీ, వీడియో కాన్ఫరెన్స్‌లో ఎవరేమన్నారంటే..
కన్నాగి నగర్ ప్రస్తుతం మరో ముంబై ధారవిని తలపిస్తోంది. ఈ ఏరియాలో ఒకే రోజు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కన్నాగి నగర్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు 30 వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు.
తమిళనాడులో ఇప్పటి వరకు 8,002 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,051 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేవలం చెన్నైలోనే 4,371 కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఒక్కరోజే చైన్నైలో 538 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాత్రి 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, ఈ నెల 17తో ముగియనున్న మూడోదశ లాక్‌డౌన్
కోయంబేడు మార్కెట్ ఇప్పుడు కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ మార్కెట్‌లో 527 మందికి కరోనా సోకింది. దీంతో కోయంబేడు మార్కెట్‌ను పోలీసులు మూసివేశారు. కోయంబేడు మార్కెట్‌లో 200లకు పైగా హోల్‌సేల్ కూరగాయల దుకాణాలు, 1000 వరకు రిటైల్ దుకాణాలు ఉన్నాయి. సాధారణ రోజున ఈ మార్కెట్‌కు సుమారు 7 వేల మంది దాకా వస్తారని అధికారులు తెలిపారు.