IPL Auction 2025 Live

Coronavirus in India: దేశంలో అత్యల్ప స్థాయికి కరోనా కేసులు, తాజాగా 31,443 మందికి కోవిడ్, 24 గంటల వ్యవధిలో 2020 మంది మృతి, జూన్ 21 నుంచి ముమ్మరంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్

మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,443 మందికి పాజిటివ్‌గా (Coronavirus in India) తేలింది. 118 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు (Covid in India) క్షీణించాయి. అయితే గత 24 గంటల వ్యవధిలో 2020 మంది ప్రాణాలు కోల్పోయారు.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, July 13: దేశంలో కొత్త కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,443 మందికి పాజిటివ్‌గా (Coronavirus in India) తేలింది. 118 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు (Covid in India) క్షీణించాయి. అయితే గత 24 గంటల వ్యవధిలో 2020 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా 1,000లోపు నమోదవుతోన్న మరణాల సంఖ్యలో.. భారీ పెరుగుదల చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలో మొత్తం కేసులు 3.09 కోట్లకు చేరగా..4,10,784 (Covid Deaths in India) మంది మహమ్మారికి బలయ్యారు.

నిన్న ఒక్కరోజే 49,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీలు 3 కోట్ల మార్కును దాటాయి. రికవరీ రేటు 97.28 శాతానికి పెరగ్గా.. క్రియాశీల రేటు 1.40 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 4,32,778 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. జనవరి 16న కేంద్రం కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకూ 38 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసింది. నిన్న 40,68,862 మంది టీకా వేయించుకున్నారు.సెకండ్ వేవ్ త‌ర్వాత ఇంత త‌క్క‌ువ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఇండియాలో రిక‌వ‌రీ రేటు 97.28 శాతానికి పెరిగిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది.దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 17,40,325 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం 43,40,58,138 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు తాజా ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా షాక్..వృద్ధురాలిపై ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్ల దాడి, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బెల్జియం మహిళా వృద్ధురాలు, రెండు వేరియంట్లు ఎలా సోకాయనే విషయం అంతుచిక్కడం లేదని తెలిపిన నివేదిక

దేశంలో జూన్ 21 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 38 కోట్ల మందికి టీకాలు వేశారు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకాలు వేసే కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. అయితే ఆగస్టు నుంచి వ్యాక్సినేషన్ మరింత ముమ్మరం కానున్నదనే అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే నెల నుంచి మనదేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ, బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ అందుబాటులో ఉండనున్నాయి. ఫలితంగా రోజుకు 80 లక్షల నుంచి 90 లక్షల మందికి టీకాలు వేసేందుకు అవకాశం కలగనుంది.

కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన 20 మంది కోవిడ్ పేషెంట్లు, మరికొందరికి తీవ్ర గాయాలు, ఇరాక్ నస్రీయా నగరంలోని అల్‌ హుస్సేయిన్‌ ఆస్పత్రిలో విషాద ఘటన

ఇప్పటికే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ తక్కువ మోతాదులో మాత్రమే నిల్వలు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో జూలైలో మొత్తం 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఉన్నాయి. ఆగస్టు నాటికి ఈ వ్యాక్సిన్ల ఉత్సాదన మరింతగా పెరగనుంది. జైడస్ క్యాడిలా కరోనా వ్యాక్సన్ డోసులు సిద్ధంగా ఉన్నప్పటికీ, దేశంలో వినియోగానికి సంబంధించి అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.