‘Interest on Interest': వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం, రుణ మారటోరియం పరిధిని పొడిగించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, ఆర్‌బీఐ

కరోనావైరస్ కాలంలో బ్యాంకు రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని పొడిగించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. రుణ మారటోరియం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం, ఆర్‌బీఐ ఈ విషయాన్ని పేర్కొంది. కేసు విచారణ సంధర్భంగా ఆరు నెలలకు మించి మరింత ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

Supreme Court of India | Photo-IANS)

New Delhi, October 10: కరోనావైరస్ కాలంలో బ్యాంకు రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని పొడిగించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. రుణ మారటోరియం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం, ఆర్‌బీఐ ఈ విషయాన్ని పేర్కొంది. కేసు విచారణ సంధర్భంగా ఆరు నెలలకు మించి మరింత ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

మారటోరియం కాలంలో 2 కోట్ల రూపాయల వరకు ఉన్న రుణాలపై 'వడ్డీపై వడ్డీని' వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదని , క్రెడాయ్ లాంటి సంఘాల వాదనలను పరిశీలించాలని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం (Centre) ఈ క్లారిటీ ఇచ్చింది. నిర్దిష్ట సెక్టార్ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి కోర్టు వెళ్లకూడదంటూ తాజా అఫిడవిట్‌లో ఆర్‌బీఐ, ప్రభుత్వం పేర్కొన్నాయి.

మారటోరియం వ్యవధి ఆరునెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరు, ప్రక్రియపై ప్రభావం చూపుతుందని ఆర్‌బీఐ (RBI) తెలిపింది. ఇలాంటి చర్యలు రుణగ్రహీతలపై ఒత్తిడిని పెంచుతాయని కూడా వాదించింది. రియల్ ఎస్టేట్ రంగం, విద్యుత్ రంగాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్రం, ఆర్‌బీఐ ఈ వివరణ ఇచ్చాయి. వడ్డీని మాఫీ చేయడమే కాకుండా, మరే ఇతర ఊరట కల్పించినా దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

గుడ్ న్యూస్..రూ.2 కోట్ల లోపు రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, పలు రుణ గ్రహీతలకు భారీ ఊరట

కాగా కోవిడ్-19 కి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని.. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని కష్టాలను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని తెలిపింది. కాగా ఆరు నెలల రుణ తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి (Interest on Interest) కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి అక్టోబర్ 5న ఒక వారం సమయం ఇచ్చింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు క్రెడాయ్, విద్యుత్ ఉత్పత్తిదారులులేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలంటూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement