Jamili Election: జమిలి ఎన్నికలపై చక చకా పనులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తొలి మీటింగ్, అన్ని రాజకీయ పార్టీల సూచనలు కోరిన కమిటీ
జమిలి ఎన్నికల (jamili elections) సాధ్యాసాధ్యాల పరిశీలిన కమిటీ తొలి సమావేశం ముగిసింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం ఈ కమిటీ ఢిల్లీలో (Delhi) తొలిసారి సమావేశం అయింది.
New Delhi, SEP 24: జమిలి ఎన్నికల (jamili elections) సాధ్యాసాధ్యాల పరిశీలిన కమిటీ తొలి సమావేశం ముగిసింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. శనివారం ఈ కమిటీ ఢిల్లీలో (Delhi) తొలిసారి సమావేశం అయింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ సభ్యులు చర్చించారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అమిత్ షా (Amith shah), అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏదైనా రాజకీయ పార్టీ కమిటీని కలిసి సూచనలు ఇవ్వవచ్చు అన్నారు. భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ సహా ఇతర సంస్థల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు చర్చలు జరపాలని నిర్ణయించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)