Odisha Shocker: 9వ తరగతి విద్యార్ధి మెడలో గుచ్చుకున్న జావెలిన్ త్రో, నొప్పితో విలవిలలాడుతూ ఆస్పత్రికి పరుగులు, తర్వాత ఏమైందంటే? ఒడిశాలో ఘటన

అక్క‌డి ప్ర‌భుత్వ‌ పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన‌ స్పోర్ట్స్ మీట్‌లో జావెలిన్ మొన (Javelin Pierces) ఒక పిల్లాడి మెడ‌లో గుచ్చుకుంది. సాధ‌న‌లో భాగంగా ఒక విద్యార్థి విసిరిన జావెలిన్ 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న స‌దానంద్‌ మెహ‌ర్ అనే విద్యార్థి మెడ‌లోకి దూసుకెళ్లింది. దాంతో అత‌ను నొప్పితో విల‌విల‌లాడాడు. ఊహించ‌ని సంఘ‌ట‌న‌తో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు షాక్ అయ్యారు

Representational image (Photo Credit- File Image)

Bhuvaneswar, DEC 17: ఒడిశాలో షాకింగ్ (Odisha Shocker) ఘటన జరిగింది. ఓ స్కూళ్లో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్‌ లో విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో భాగంగా ఒక విద్యార్ధి విసిరిన జావెలిన్(Javelin)...మరో విద్యార్ధి మెడలో గుచ్చుకుంది. ఊహించని ఘటనతో అంతా షాక్ కు గురయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని బ‌ల‌న్‌గిర్ జిల్లాలో (Balangir) ఈ ఘటన జరిగింది. అక్క‌డి ప్ర‌భుత్వ‌ పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన‌ స్పోర్ట్స్ మీట్‌లో జావెలిన్ మొన (Javelin Pierces) ఒక పిల్లాడి మెడ‌లో గుచ్చుకుంది. సాధ‌న‌లో భాగంగా ఒక విద్యార్థి విసిరిన జావెలిన్ 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న స‌దానంద్‌ మెహ‌ర్ అనే విద్యార్థి మెడ‌లోకి దూసుకెళ్లింది. దాంతో అత‌ను నొప్పితో విల‌విల‌లాడాడు. ఊహించ‌ని సంఘ‌ట‌న‌తో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. స‌దానంద్‌ను (Sadanand) వెంట‌నే అత్య‌వ‌స‌ర వైద్యం కోసం అక్క‌డి భీమ భోయి మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించారు. ఏడుగురు ప్ర‌త్యేక వైద్యుల బృందం గంట పాటు ఆప‌రేష‌న్ చేసి అత‌డి మెడ‌కు గుచ్చుకున్న జావెలిన్ మొన‌ను తొల‌గించింది.

దాంతో, అత‌డు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆరోగ్యం జిల్లా విద్యాధికారి, స‌బ్ క‌లెక్ట‌ర్ ఆస్ప‌త్రికి వ‌చ్చి స‌దానంద్ ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకున్నారు. అగల్పూర్‌ ప్ర‌భుత్వ బాలుర‌ ఉన్న‌త పాఠ‌శాల‌లో మ‌రికొన్ని రోజుల్లో వార్షిక‌ స్పోర్ట్స్ మీట్ జ‌ర‌గ‌నుంది.

Madhya Pradesh: నాలుగు కాళ్లతో పుట్టిన శిశువు, మధ్యప్రదేశ్ లో వింత ఘటన, చూసేందుకు వస్తున్న జనం.. 

దాంతో, ఉపాధ్యాయులు విద్యార్థుల‌తో ఆటలు సాధ‌న చేపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒక విద్యార్థి విసిరిన జావెలిన్ మొన స‌దానంద్ మెడ‌లో గుచ్చుకుంది. గాయపడ్డ విద్యార్ధికి అన్ని విధాలా సాయంగా ఉంటామని సీఎం నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చారు. అతనికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement