Girl Dies By Suicide: బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ విద్యార్థినిని కొట్టిన టీచర్, మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్

జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విద్యార్థిని పట్ల పాఠశాల (School) ఉపాధ్యాయుడు అమానుషంగా వ్యవహరించాడు. హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఓ విద్యార్థిని నుదుటిన బొట్టు (Bindi) పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది

Representative image. (Photo Credits: Unsplash)

Dhanbad, july 12: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విద్యార్థిని పట్ల పాఠశాల (School) ఉపాధ్యాయుడు అమానుషంగా వ్యవహరించాడు. హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఓ విద్యార్థిని నుదుటిన బొట్టు (Bindi) పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. దీంతో పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు సదరు విద్యార్థినిని బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ చితకబాదాడు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని ఆత్మహత్యకు (Suicide) పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

బట్టతల దాచి రెండో పెళ్లికి సిద్ధమైన వరుడు, విషయం తెలిసి చితకబాదిన వధువు కుటుంబ సభ్యులు, మొదటి భార్య రావడంతో..

జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం ధన్‌బాద్‌ (Dhanbad)లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనతో మృతురాలి తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాల వద్ద యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఘటనపై పోలీసులు కలుగజేసుకొని సదరు ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఆ రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ఉత్తమ్ ముఖర్జీ స్పందించారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now