Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియోల కలకలం, శాసనమండలిలో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌, వార్తలను ఖండించిన నేత, గతంలో పోర్న్ చూస్తూ దొరికిన ముగ్గురు బీజేపీ నేతలు

కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియోలు కలకలం రేపాయి. ఇంతకు ముందే కర్ణాటక అసెంబ్లీలో (Karnataka assembly) ప్రజా ప్రతినిధులు పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కిన సందర్భాలు (watching obscene videos in Assembly) ఉన్నాయి. తాజాగా మరో నేత ప్రజా సభలో పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయారు.

Prakash Rathod (Photo Credits: Twitter)

Bengaluru, January 29: కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియోలు కలకలం రేపాయి. ఇంతకు ముందే కర్ణాటక అసెంబ్లీలో (Karnataka assembly) ప్రజా ప్రతినిధులు పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కిన సందర్భాలు (watching obscene videos in Assembly) ఉన్నాయి. తాజాగా మరో నేత ప్రజా సభలో పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయారు. కర్నాటక అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తర్వాత శాసనమండలిలో చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ (Karnataka Congress MLC Prakash Rathod)సెల్‌ఫోన్‌లో అశ్లీల వెబ్‌సైట్‌లో వీడియోలు చూస్తూ గడిపాడు.

ఈ సీన్ కెమెరాకు చిక్కడంతో ఆయన వెంటనే ఈ వార్తలను ఖండించారు. తాను ఆ వీడియోలు చూడలేదని.. తాను గ్రామీణాభివృద్ధిపై మంత్రితో మాట్లాడుతున్నానని.. దానికి సంబంధించిన ప్రశ్నల కోసం సెల్‌ఫోన్‌లో వెతుకుతున్నానని ప్రకాశ్‌ రాథోడ్‌ వివరణ ఇచ్చారు. సెల్‌ఫోన్‌లో డేటా నిండిపోవడంతో కొన్ని డిలీట్‌ చేస్తున్నట్లు రాథోడ్‌ తెలిపారు. అయితే రాథోడ్‌ చేసిన పనిని బీజేపీ తప్పుపట్టింది. వెంటనే అతడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

పోర్న్ సైట్ల వల్లే రేప్‌లు పెరిగిపోతున్నాయి, ఈ పోర్న్‌సైట్లను వెంటనే నిషేధించాలి

కాగా ర్నాటకలో అసెంబ్లీ అశ్లీల వీడియోలు చూడడం కొత్తేం కాదు. 2012లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పోర్న్‌ వీడియోలు చూస్తూ దొరికిపోయారు. స్థానిక మీడియా ఆ వీడియోలను విస్తృతంగా ప్రచారం చేయడంతో సదరు మంత్రులు తమ పదవులకూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు ప్రస్తుతం ఎమ్మెల్యే లక్ష్మన్‌ సౌదీ ఉప ముఖ్యమంత్రిగా ఉండడం గమనార్హం.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement