Karnataka Horror: ప్రియుడి కోసం వెళ్లిన ప్రియురాలు, తలుపులేసి ఆమెపై కామవాంఛ తీర్చుకున్న మామ, నిందితుడిని అరెస్ట్ చేసిన చిక్కమగళూరు పోలీసులు

మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు నిర్భయ లాంటి చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చినా.. అవి మాత్రం ఆగడం లేదు. తాజాగా కుమారుడు ప్రేమించిన మైనర్‌ బాలికపై.. బాలుడి తండ్రి అత్యాచారానికి (Minor Girl Sexually Assaulted by Lover's Father) పాల్పడ్డాడు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Bengaluru, November 10: మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు నిర్భయ లాంటి చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చినా.. అవి మాత్రం ఆగడం లేదు. తాజాగా కుమారుడు ప్రేమించిన మైనర్‌ బాలికపై.. బాలుడి తండ్రి అత్యాచారానికి (Minor Girl Sexually Assaulted by Lover's Father) పాల్పడ్డాడు. కర్ణాటకలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు ప్రేమించిన మైనర్‌ బాలికపై అతని తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిక్కమగళూరు (Chikkamagalur District) బాళే హొన్నూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్‌ బాలికను ఓ యువకుడు ప్రేమలోకి దించాడు. కొంత కాలం వారిద్దరి మధ్య ప్రేమ నడిచిన తరువాత ఇంటికి తీసుకువెళ్లడం ప్రారంభించాడు. మొన్న కూడా తన లవర్ ని తన ఇంటికి తీసుకెళ్లి ఏదో పని మీద బయటికి వెళ్లాడు. ఆ సమయంలో యువకుని తండ్రి చంద్రు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. బాలికపై కన్నేసిన అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు.

మరొకరితో పడుకోమన్న భర్త, తట్టుకోలేక మొగుడ్ని రాడ్‌తో కొట్టి చంపేసిన రెండో భార్య, కేసును దర్యాప్తు చేస్తున్న బెంగుళూరు పోలీసులు 

ఈ ఘటనపై బాధితురాలి తల్లి బాళేహొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్టు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు చిక్కమగళూరు బాలెహోన్నూరు పోలీసులు బుధవారం తెలిపారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement