Karnataka Horror: పెళ్లికి ఒప్పుకోలేదని నడిరోడ్డు మీద లవర్‌ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, అనంతరం విషం తాగి ఆత్మహత్యాయత్నం, మృతి చెందిన ప్రియురాలు

పెండ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు తన ప్రియురాలిని నడిరోడ్డు మీద అత్యంత దారుణంగా పొడిచి చంపాడు.కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సుల్తానా అనే యువతి, చాంద్‌ పీర్‌ అలియాస్‌ సాదత్‌ అనే యువకుడు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

Representative Image Murder ( Photo Credits : Pixabay

Bengaluru, Dec 22: పెండ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు తన ప్రియురాలిని నడిరోడ్డు మీద అత్యంత దారుణంగా పొడిచి చంపాడు.కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సుల్తానా అనే యువతి, చాంద్‌ పీర్‌ అలియాస్‌ సాదత్‌ అనే యువకుడు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, చాంద్‌ పీర్‌ పెండ్లి ప్రస్తావన తీసుకురాగా సుల్తానా అందుకు నిరాకరించింది. ఇటీవల సుల్తానాకు మరో యువకుడితో పెండ్లి నిశ్చయం చేశారు.

టీచరమ్మపై మరో టీచర్ దారుణం, అందుకు ఒప్పుకోలేదని ఆమె కొడుకు తలను గోడకేసి బాది, స్కూల్‌ బిల్డింగ్‌ పైనుంచి కిందకు పడేసి హత్య, కర్ణాటకలో దారుణ ఘటన

విషయం తెలుసుకున్న చాంద్‌ పీర్‌ మాట్లాడుకుందాం రమ్మని యువతిని బయటికి పిలిచాడు. స్కూటీపై వచ్చిన యువతితో మాట్లాడుతూనే వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం అక్కడి కొంత దూరం బైకుపై వెళ్లి విషం తాగి పడిపోయాడు.ఇది గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

నిద్రలో వెంటాడిన పీడకలలు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి, పీడ క‌ల‌లు రావడంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు సూసైడ్ లేఖ

పరీక్షించిన వైద్యులు సుల్తానా అప్పటికే మరణించినట్లు చెప్పారు. చాంద్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement