Karnataka Election Results: కర్ణాటక తుది ఫలితాలు ఇవే! ఎవరూ అంచనా వేయని స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయదుందుభీ, గత ఎన్నికలతో పోలిస్తే ఎన్ని సీట్లు ఎక్కువ వచ్చాయో తెలుసా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Election Results) కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ (BJP) 65 సీట్లకే పరిమితం అయింది. జేడీఎస్ (JDS) 19 సీట్లు, కల్యాణ రాజ్య ప్రగతి పక్షం పార్టీ, సర్వోదయ కర్ణాటక పక్షం పార్టీ ఒక్కో సీటు చొప్పున గెలుచుకున్నాయి. అలాగే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 113 స్థానాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.

DK Shivakumar with former Karnataka CM Siddaramaiah (Photo-PTI)

Bangalore, May 13: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Election Results) కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ (BJP) 65 సీట్లకే పరిమితం అయింది. జేడీఎస్ (JDS) 19 సీట్లు, కల్యాణ రాజ్య ప్రగతి పక్షం పార్టీ, సర్వోదయ కర్ణాటక పక్షం పార్టీ ఒక్కో సీటు చొప్పున గెలుచుకున్నాయి. అలాగే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 113 స్థానాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కాంగ్రెస్ కి (Congress) అంతకంటే 23 సీట్లు ఎక్కువ వచ్చాయి. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎన్నికల్లో గెలవడంతో బెంగళూరులో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి (karnataka CM Candidate) ఎన్నికపై కొత్త ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నందిని బ్రాండ్ స్వీట్లను తమ నేతలకు పంచారు. కర్ణాటక ఎన్నికల్లో అమూల్ Vs నందిని బ్రాండ్ల విషయంలో మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.

కొత్త ముఖ్యమంత్రి ఈ నెల 15న ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. కంఠీరవ స్టేడియంలో సీఎం ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ (DK Shivkumar) రేసులో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్నది ఆదివారం ఖరారుకానున్నది.

కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ మెజార్టీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకుున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి, బీజేఎస్పీ, కేపీజేపీకి ఒక్కో సీటు దక్కాయి. ఆ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. చివరకు జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పదవిని అప్పజెప్పుతూ జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ సర్కారు ఏర్పడింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement