Karnataka Shocker: దారుణం, నిద్రిస్తున్న పిన్నిపై అత్యాచారం చేయబోయిన బాలుడు, ఒప్పుకోకపోవడంతో హత్య, గుండెపోటుతో చనిపోయిందంటూ నాటకం

తన అసభ్యకరమైన ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంలో పిన్నిని హత్య చేసిన 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

Crime (Photo-File)

Bengaluru, June 20: తన అసభ్యకరమైన ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంలో పిన్నిని హత్య చేసిన 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 37 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.కాగా నిద్రిస్తున్న పిన్నితో లైంగిక చర్య కోసం బాలుడు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమె అతడ్ని తీవ్రంగా మందలించింది. దీని గురించి కుటుంబ సభ్యులకు చెబుతుందన్న భయంతో ఆ మహిళను బాలుడు హత్య చేశాడు. అనంతరం తన తండ్రికి ఫోన్‌ చేశాడు. గుండెపోటుతో పిన్ని చనిపోయిందని చెప్పాడు.  పోర్న్ వీడియోలు చూసి కన్న కూతురిపై కన్ను, పొదల్లోకి తీసుకువెళ్ళి కామవాంఛలు తీర్చాలంటూ వేధింపులు, ఒప్పుకోకపోవడంతో దారుణ హత్య

మహిళ అనుమానాస్పద మరణం గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఆమె ఇంట్లో ఉన్న బాలుడిపై అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడి వీపుపై చేతితో రక్కిన ఆనవాళ్లు ఉన్నట్లు బాలుడి తండ్రి పోలీసులకు తెలిపాడు. బుధవారం బాలుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో ఆమెను తానే చంపినట్లు అతడు ఒప్పుకున్నాడు.

ఇంట్లో నిద్రిస్తున్న పిన్నితో లైంగిక చర్య కోసం ప్రయత్నించినట్లు ఆ బాలుడు తెలిపాడు. ప్రతిఘటించిన ఆమె తనను మందలించిందని పోలీసులకు చెప్పాడు. అయితే ఇంట్లో వారికి దీని గురించి చెబుతుందేమోనని భయాందోళన చెందానని అన్నాడు. తిరిగి నిద్రలోకి జారుకున్న పిన్ని ముఖాన్ని దిండితో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తనను తోసివేసేందుకు ప్రయత్నించినప్పుడు తన వీపుపై ఆమె రక్కిందని పోలీసులకు వెల్లడించాడు. ఆ బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement