Karnataka Shocker: కర్ణాటకలో తీవ్ర విషాదం,అమ్మమ్మ చనిపోయిందనే బెంగతో ముగ్గురు అక్కాచెల్లెల్లు ఉరివేసుకుని ఆత్మహత్య

తల్లీ తండ్రీ మృతి చెందండంతో పాటు ఉన్న ఒక్కగానొక్క అమ్మమ్మ కూడా మరణించడంతో ఆవేదన చెందిన ముగ్గురు అక్కాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకున్నారు.

Image used for representational purpose | (Photo Credits: Pixabay)

కర్ణాటక రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లీ తండ్రీ మృతి చెందడంతో పాటు ఉన్న ఒక్కగానొక్క అమ్మమ్మ కూడా మరణించడంతో ఆవేదన చెందిన ముగ్గురు అక్కాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకున్నారు. తమకు ఎవరూ లేరనే దిగులుతో ముగ్గురు అక్కచెల్లెళ్లు బలవన్మరణానికి (Three sisters die by suicide) పాల్పడ్డారు. కర్ణాటకలోని తమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా బరకనహాల్‌ తాండాలో గురువారం ఈ విషాద ఘటన వెలుగుచూసింది.

స్కూల్లో కుర్చీలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా గుండెపోటు, తోటి ఉపాధ్యాయుల ముందే కుప్పకూలిన ఉపాధ్యాయురాలు, మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాద ఘటన

తాండాలో అక్కాచెల్లెల్లైన రంజిత924), బిందు(21),చందన(18)ల తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే మరణించారు. అప్పటి నుంచి వీరంతా అమ్మమ్మ దగ్గరే ఉంటున్నారు. ఆమె కూడా మూడు నెలల క్రితం మరణించడంతో (grandmother's death) ముగ్గురూ దిగులుపడిపోయారు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. తాము అనాథలం అయిపోయామని ప్రతి రోజూ వేదన చెందేవారు. రంజిత, బిందు ఓ గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. చందన పీయూసీ చదువుతోంది. అయితే 9 రోజుల నుంచి ముగ్గురూ ఇంటి నుంచి బయటకు రాలేదు.

30-35 వయస్సు వారికే గుండెపోటు అవకాశాలు ఎక్కువ, ఎందుకో తెలుసా? సంచలనం సృష్టిస్తున్న డాక్టర్ల అధ్యయనాలు, గతంతో పోలిస్తే పెరిగిన గుండెపోటు రిస్క్ శాతం

గురువారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు విషయాన్ని తెలిపారు. వారు వచ్చి ఇంటి పైకప్పు తీసి పరిశీలించగా ముగ్గురూ ఉరివేసుకున్నట్లు కనిపించారు. మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటిని చిక్కనాయకనహళ్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్గానికి తరలించారు.