Kerala Shocker: పెళ్ళి పీటల మీద నుంచి పెళ్లికూతురును లాక్కెళ్లిన పోలీసులు, కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు

కేరళలో వధువు (Bride) మెడలో వరుడు (Groom) తాళికట్టడానికి కొద్ది క్షణాల ముందు మండపంలోకి పోలీసులు ప్రవేశించి వధువును బలవంతంగా పీటలపై నుంచి లాక్కెళ్లి కోర్టుకు తీసుకెళ్లారు.. తాను రానని అల్ఫియా అరుస్తుండగా ఆమెను బలవంతంగా ఓ ప్రైవేటు వాహనంలోకి ఎక్కించారు

Wedding Representational Image

కేరళలో వధువు (Bride) మెడలో వరుడు (Groom) తాళికట్టడానికి కొద్ది క్షణాల ముందు మండపంలోకి పోలీసులు ప్రవేశించి వధువును బలవంతంగా పీటలపై నుంచి లాక్కెళ్లి కోర్టుకు తీసుకెళ్లారు.. తాను రానని అల్ఫియా అరుస్తుండగా ఆమెను బలవంతంగా ఓ ప్రైవేటు వాహనంలోకి ఎక్కించారు. వరుడు అఖిల్‌ ఆమె దగ్గరకు వెళ్తుంటే పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

తెలంగాణలో ఘోర విషాదాలు, చిన్న పిల్లల్ని ముందు చంపి తరువాత ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు

దీనిపై అలప్పుళ జిల్లా సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అల్ఫియా కన్పించకుండా పోయినట్లు తమకు ఫిర్యాదు అందిందని, దానిపై తాము దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆమె పెళ్లి చేసుకుంటుందని తెలిసి అక్కడకు వెళ్లామని, కోర్టు ఆదేశాల మేరకు ఆమెను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. అయితే మేజర్‌ అయిన ఆమె అఖిల్‌తోనే వెళ్తానని చెప్పడంతో కోర్టు అందుకు అంగీకరించిందని తెలిపారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement