Maharashtra: కదులుతున్న రైలులో తెగబడిన కామాంధులు, మహిళపై అరగంట పాటు 8 మంది సామూహిక అత్యాచారం, లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణ ఘటన, నలుగురు అరెస్ట్
చివరకు కదులుతున్న రైళ్లు కూడా కామాంధులకు వేదికగా మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో (Maharashtra) దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం (8 women gang-raped in moving train) జరిపిన దారుణ ఘటన శనివారం వెలుగుచూసింది.
Mumbai, Oct 9: దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు, కదులుతున్న బస్సులు, ఆటోలు, లారీలు ఈ కామాంధులకు వేదికలవుతున్నాయి. చివరకు కదులుతున్న రైళ్లు కూడా కామాంధులకు వేదికగా మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో (Maharashtra) దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం (8 women gang-raped in moving train) జరిపిన దారుణ ఘటన శనివారం వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో-ముంబై వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఇగత్‌పురి స్టేషన్ నుంచి బయలుదేరినప్పుడు ఈ దారుణ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. పుష్పక్ రైలు కంపార్టుమెంటులోకి 8మంది బలవంతంగా ప్రవేశించి కత్తులు చూపించి 20మంది ప్రయాణికులను దోచుకున్నారు.ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అక్కడ ఓ మహిళపై 8 మంది కీచకులు అత్యాచారానికి పాల్పడ్డారు.రైలులో ఉన్న 30 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిపై 8మంది దుండగులు సామూహిక అత్యాచారం జరిపారు.
బాధిత మహిళకు గాయాలయ్యాయి.అరగంట పాటు నిందితులు మహిళపై అఘాయిత్యం చేశారు. రైలు కాసర స్టేషనుకు చేరుకోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Here's ANI Tweet
అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు (4 arrested) చేశామని పోలీసులు శనివారం తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.