
Aizawl, Oct 7: ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో దారుణ ఘటన చోటు (Mizoram Horror) చేసుకుంది. ఓ వ్యక్తి మానవబాంబుగా మారి భార్యను చంపేశాడు. సాధారణంగా భార్య మీద భర్తకు కోపం వస్తే విడాకులు ఇవ్వడం చూస్తుంటాం..అయితే మిజోరాంలో మాత్రం ఈ వ్యక్తి ఏకంగా మానవ బాంబుగా మారి తన భార్యని (62-yr-old man kills ex-wife) హతమార్చాడు. ఈ దారుణ ఘటనలో మిజోరాంలోని లుంగ్‌లేయి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, TOI తెలిపిన వివరాలు ప్రకారం.. లుంగ్‌లేయి జిల్లాకు చెందిన రోహ్ మింగ్‌లైనా(62), ట్లాంగ్థియాన్‌ఘ్లిమి(61) దంపతులు. ట్లాంగ్థియాన్‌ఘ్లిమి ఆ ప్రాంతలోనే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఈ జంట ఒక సంవత్సరం క్రితం మనస్పర్థలు రావడంతో అప్పటి నుంచి విడిగా ఉంటున్నారని సమాచారం. అయితే మంగళవారం మధ్యాహ్నం భార్య వద్దకు వచ్చిన అతను ప్రేమ వలకబోస్తూ మాట్లాడాడు. తను జ్వరంతో బాధపడుతున్నట్లు నటిస్తూ, మైకం వచ్చినట్లు అకస్మాత్తుగా తన భార్యను కౌగిలించుకున్నాడు, ఆ తర్వాత పెద్ద పేలుడు (suicide bomb attack in Lunglei) సంభవించింది. దీంతో వారిద్దరిని వెంటనే లుంగ్లీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే, పేలుడులో మృతురాలి కుమార్తె కొంచెం దూరంగా ఉండడంతో ఆమె గాయపడలేదు. ఈ ఘటనపై లంగ్లీ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. పేలుడులో జెలటిన్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.