Maharashtra: కామాంధులకు ఇదేమి పోయకాలం, మానిటర్ బల్లిపై నలుగురు దారుణంగా అత్యాచారం, ఈ రేప్ ఘటనను వీడియోలో చిత్రీకరించిన కామాంధులు, వీడియో చూసి షాక్ తిన్న మహారాష్ట్ర పోలీసులు

మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో ( Gang-Raped in Sahydari Tiger Reserve) ఈ దారుణం చోటు చేసుకుంది.

Monitor Lizard. Credits: Pixabay

Mumbai, April 14: కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. కళ్లు మూసుకుపోతే మానవ మృగాలు జంతువులనైనా వదలిపెట్టరని మరోసారి రుజువైంది. ఇంతకు ముందు కుక్కలు, ఆవులు, ఇతర జంతువులపై కళ్లుమూసుకుపోయిన మానవ మృగాలు అత్యాచారంకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ గ్యాంగ్ ఏకంగా 'ఉడుము'పై (Bengal monitor lizard) గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది. మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో ( Gang-Raped in Sahydari Tiger Reserve) ఈ దారుణం చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు ఆ గ్యాంగ్‌ను పట్టుకుని వారి సెల్‌ఫోన్లు చెక్ చేయగా... ఉడుముపై గ్యాంగ్ రేప్ ఉదంతం బయటపడింది.

జంతువులను వేటాడేందుకు ఆ నలుగురు ( Four Arrested) గ్యాంగ్ సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లోకి చొరబడ్డారు. గొథానే అనే గ్రామ సమీపంలో ఉడుమును పట్టుకున్న ఆ గ్యాంగ్... అక్కడే దానిపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆ తతంగాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఓ గ్యాంగ్ టైగర్ రిజర్వ్‌లోకి చొరబడినట్లు గుర్తించిన అటవీ అధికారులు... ఎట్టకేలకు వారిని పట్టుకోగలిగారు. ఆపై ఆ నలుగురి సెల్‌ఫోన్లు పరిశీలించగా ఉడుముపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన దృశ్యాలు అందులో కనిపించాయి. వీరిని సందీప్‌ తుకారాం, పవార్‌ మంగేశ్, జనార్ధన్, అక్షయ్‌ సునీల్‌గా గుర్తించారు.

మరో నిర్భయ ఘటన, మహిళ రహస్య భాగాల్లో ఇనుపరాడ్ చొప్పించి దారుణంగా అత్యాచారం, అనంతరం బాధితురాలిని చంపేసిన కామాంధుడు, నిందితుడు అరెస్ట్

షాక్ తిన్న అధికారులు వెంటనే ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితుల్లో ముగ్గురు కొంకన్ ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. బెంగాల్ మానిటర్ లిజర్డ్‌పై వీరు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. నలుగురిని కోర్టు ముందు హాజరపరచనున్నట్లు వెల్లడించారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం బెంగాల్‌ మానిటర్‌ లిజార్డ్‌ను రిజర్వ్‌డ్‌ జాతిగా గుర్తించారు. వీరి నేరం రుజువైతే 7ఏళ్ల కారాగార శిక్ష పడవచ్చు.

బదిలీ కావాలని అడిగిన ఉద్యోగి, నీ భార్యను రాత్రికి నా దగ్గరకు పంపితే చూద్దామన్న పై అధికారి, తట్టుకోలేక ఒంటిపై డీజిల్‌పోసుకుని నిప్పంటించుకున్న బాధితుడు, చికిత్స పొందుతూ మృతి

సాధారణంగా ఉడుము రక్తం తాగితే లేదా మాంసం తింటే పలు రకాల వ్యాధులు నయమవుతాయని కొంతమంది నమ్ముతుంటారు. వాటిని అక్రమంగా వేటాడి విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఉడుముపై లైంగిక దాడి వెనక మరేదైనా కోణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటన గురించి తెలిసి ఆ కామాంధులను ఏం చేసినా తప్పు లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.