Janjgir-Champa, April 12: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళను దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు కామాంధుడు. ఛత్తీస్‌గఢ్‌లోని (Chattisgarh Shocker) జాంజ్‌గిర్-చంపా జిల్లాలో 56 ఏళ్ల మానసిక అనారోగ్యంతో ఉన్న మహిళపై అత్యాచారం (Man Arrested As Woman Dies After Being Raped) చేసి, ఆమె రహస్య భాగాలలో రాడ్‌ని చొప్పించి, ఆమె మరణానికి దారితీసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. ఈ సంఘటన ఏప్రిల్ 5 మరియు 6 మధ్య రాత్రి దభారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరాణా దుకాణం ముందు ఉన్న బెంచ్‌పై ఆ మహిళ నిద్రిస్తుండగా జరిగిందని అధికారి తెలిపారు
తొలుత 56 మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులు మొదట యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయాలు వెలుగు చూశాయి. ఆ తర్వాత పోలీసులు సీసీఫుటేజ్‌ల ఆధారంగా ఆమె పై ఎవరో క్రూరంగా దాడి చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెను ఇనుపరాడ్‌తో తీవ్రంగా కొట్టి ఒక ప్లాట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడన్నారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమె ప్రైవేట్ భాగాలలో ఒక ఇనుప కడ్డీని (Brutalised With Iron Rod) చొప్పించాడు. తర్వాత అతికిరాతకంగా చంపి అక్కడ నుంచి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు.
అయితే ఆ మహిళ మానసిక వికలాంగురాలని, తల్లిదండ్రులు చనిపోవడంతో స్థానికులు పెట్టే ఆహారం తింటూ గడుపుతోందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు 31 ఏళ్ల కిషన్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బట్టలు, ఇనుప రాడ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.