Kolhapur Shocker: అక్కా చెల్లెళ్లకు తొలి రాత్రి, శీలవతులు కాదని పుట్టింటికి పంపించేసిన భర్తలు, ఎవరితోనో సంబంధం ఉందని ఆరోపించిన పంచాయతీ పెద్దలు, పోలీసులను ఆశ్రయించిన అమ్మాయి తల్లిదండ్రులు

తొలి రాత్రి ఆనందంగా గడపాల్సిన పెళ్లికూతుర్లు తమ భర్తలు చేసిన పనికి షాక్ అయ్యారు. భర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Representational Image (Photo Credits: unsplash.com)

Kolhapur, April 10: మహారాష్ట్రలో కొల్హాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తొలి రాత్రి ఆనందంగా గడపాల్సిన పెళ్లికూతుర్లు తమ భర్తలు చేసిన పనికి షాక్ అయ్యారు. భర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాల్లోకెళితే.. కొల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే గ్రామానికి చెందిన అన్నాతమ్ముళ్లతో నవంబర్‌ 27న పెళ్లి జరిపించారు. అయితే ఆ రోజు రాత్రి ఇద్దరికీ శోభనం అరేంజ్ చేశారు. ఇక తొలిరాత్రి తర్వాత వధువు శీలవతా? కాదా అని తెలుసుకోవడానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కన్యత్వ పరీక్షను నిర్వహించారు.

ఇందులో ఒకరు మాత్రమే ఉత్తీర్ణులు కాగా, మరొక వధువుకి ఎలాంటి రక్తస్రావం (Woman fails 'virginity test) కాలేదు. దీంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను భర్తలు పుట్టింటికి పంపించేశారు. ఈ పెళ్లిని తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు (divorce order)ప్రకటించడమే కాకుండా, 10 లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఈ ఘటనతో షాక్ తిన్నవధువు తల్లిదండ్రులు ఈ అంశంపై జాత్ పంచాయతీ (jaat panchayat) వారిని సంప్రదించగా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. వారు సమస్య పరిష్కారం కోసం రూ. 40 వేల రూపాయలు డిమాండ్ చేశారు.

మామతో రెండేళ్లుగా అక్రమ సంబంధం, అడ్డుగా ఉన్న భర్తను గుట్టుగా చంపేసిన భార్య, కర్ణాటకలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హోస్‌పేట పోలీసులు

కులంలోని కట్టబాట్ల ప్రకారం వర్జినిటీ పరీక్షలో యువతి విఫలమయిందని, దీంతో ఆమెకు ఇదివరకే ఎవరితోనో సంబంధం ఉందని పంచాయతీ పెద్దలు ఆరోపించారు. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామని తీర్పుచెప్పారు. కాగా మహారాష్ట్రలో ఎక్కువగా కనిపించే కంజర్భట్ వర్గంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ వర్గంలోని ప్రతి మహిళ పెళ్లైన రోజున ఈ పరీక్ష ఎదుర్కోవాల్సిందే. అది కూడా గ్రామ పంచాయతీ పర్యవేక్షణలోనే జరగాలి.

తండ్రి లేడు..చెల్లెలిపై అదేపనిగా అత్యాచారానికి పాల్పడిన అన్నలు, నిందితులకు సహకరించిన తల్లి,పెద్దమ్మ, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి

వధువు తల్లిదండ్రులు ముందుగా మహారాష్ట్ర అంధశ్రాద్ధ నిర్ములన్ సమితిని ఆశ్రయంచి జరిగినదంతా వారికి చెప్పారు.వారు వెంటనే పోలీసు ఫిర్యాదు చేశారు. ఇద్దరు భర్తలు, అత్తగారు మరియు ఇతరులపై భారత శిక్షాస్మృతి మరియు మహారాష్ట్ర నిషేధం నుండి సామాజిక బహిష్కరణ (నివారణ, నిషేధం మరియు పరిష్కార) చట్టం కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) వీరిపై నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.