Bengaluru, April 7: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. వరసకు మామతో అక్రమ సంబంధం (illicit affair with her uncle) పెట్టుకున్న ఓ వివాహిత ఆమె భర్తను మనుషులను పెట్టి (Karnataka Shocker) చంపించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని హోస్‌పేటలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 20న రాత్రి టీబీ డ్యాం పీఎల్‌సీ కాలనీ నివాసి, కేబుల్ ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్న మైకేల్ జాన్(40) అనే వ్యక్తిని పాశవికంగా హతమార్చారు.
రైల్వే ట్రాక్ వద్ద మద్యం మత్తులో ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బండరాయిని తలపై వేశారు.ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి.నారాయణ ఆధ్వర్యంలో పోలీసు బృందం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది.
విచారణలో భాగంగా, చివరికి ఈ కేసులో మైకేల్‌జాన్ భార్య సుర్గుణంను ప్రధాన ముద్దాయిగా తేల్చారు. ఆమెకు తన బంధువు, వరుసకు మామ అయ్యే వినోద్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం (illicit affair) ఉండేది. ఎలాగైనా వినోద్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరికతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది.
మద్యానికి బానిసగా మారి తరచు తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న అతడిని హతమార్చేందుకు ప్రియుడు వినోద్‌తో కలిసి ఈ ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. ఇక ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినోద్, అశోక్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్యను స్థానిక పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.