Kottagudem, April 7: సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది, వావి వరసలు మరచి కామాంధులు (Bhadradri Kothagudem Shocker) అత్యాచారానికి ఒడిగుడుతున్నారు. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో అన్నలే తోడబుట్టిన చెల్లెలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. గత కొన్నేళ్లుగా యువతిపై తోడబుట్టిన సోదరులే చెల్లెలిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.
సోదరులు ఇలా తనపై అత్యాచారానికి (brothers rape on his own sister) ఒడిగడుతున్నారని తల్లికి, పెద్దమ్మకు చెప్పినా వారు పట్టించుకోలేదు. అంతేగాక నిందితులకు తన తల్లి. పెద్దమ్మ కూడా సహకరించారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసుంది.
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్‌లో సొంత చెల్లిపై అన్నతోపాటు పెద్ద కొడుకు బలవంతంగా లైంగిక దాడి చేశారు. గత కొన్ని నెలల నుంచి చెల్లిని చిత్రహింసలు పెడుతూ వచ్చారు. అన్నలు ఇబ్బందులు పెడుతున్న విషయం మా అమ్మకు, పెద్దమ్మ, పెద్దనాన్నకు చెప్పానని, అయిన వారు పట్టించుకోకపోగా వారికే సపోర్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలిస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేస్తానని చెప్పినప్పుడల్లా తనను చంపుతానని బెదిరించేవారని దీంతో పోలీసులకు చెప్పలేకపోయానని వాపోయింది.
తన తండ్రి లేకపోవడతో అలుసుగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పుకోచ్చింది. రోజు రోజుకు అన్న చిత్రహింసలు భరించలేక కొత్తగూడెం టూ టౌన్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. దీంతో పోలిసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఈ దారుణ విషయం బయటపడటంతో లైంగిక దాడి చేసిన పెద్దమ్మ కొడుకు ఇంట్లో ఊరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.