Dubai: నగ్నంగా మహిళలు, దుబాయ్‌లో బాల్కనీలో బట్టల్లేకుండా నిల్చున్నందుకు పన్నెండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, సదరు మహిళలపై కేసు నమోదు
Arrested| Representational Image (Photo Credit: ANI)

Dubai, Apr 6: దుబాయ్‌లో బట్టల్లేకుండా నగ్నంగా ఉంటూ అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో పన్నెండు మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా బాల్కనీలో నిల్చుని నగ్న ప్రదర్శన చేసినందుకు దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాల్లోకెళితే..మెరీనా మార్కెట్‌ ఏరియాలోని ఓ అపార్టుమెంటు బాల్కనీలోకి పగటిపూట కొంతమంది మహిళలు వచ్చారు. వివస్త్రలుగా మారి అక్కడ నిల్చున్నారు.

ఈ విషయాన్ని గమనించిన కొంతమంది వ్యక్తులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. అసభ్య ప్రవర్తనతో ప్రజలను అసౌకర్యానికి గురిచేసినందుకు సదరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘ఎమిరాటి సంస్కృతీ సంప్రదాయాలను కాలరాసే విధంగా ఉన్న ఇలాంటి విలువలు లేని ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. అందుకే క్రిమినల్‌ కేసు నమోదు చేశాం’’ అని ఒక ప్రకటన విడుదల చేశారు.

మనుషుల నుంచి జంతువులకు కరోనా, పెంపుడు జంతువుల‌కు దూరంగా ఉండ‌టం మంచిదని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో, ఇత‌ర జంతువుల‌పై వైర‌స్ ప్ర‌భావం గురించి అధ్యయనం

ఇందుకు సంబంధించి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. కాగా సంప్రదాయాలకు మారుపేరైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఇలాంటి ఘటనలకు పాల్పడిన వ్యక్తులకు 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు 5 వేల దీరాంలు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే విధంగా అశ్లీల వీడియోలు షేర్‌ చేసినందుకు షరియా చట్టాల ప్రకారం, కఠిన శిక్షలు విధించే ఆస్కారం ఉంటుంది.