Flashes Private Parts at Woman: ఢిల్లీ బస్సులో కామాంధుడు! పక్క సీటులో కూర్చొని మహిళకు అది చూపించిన వ్యక్తి, మార్షల్స్ పట్టుకోవడంతో గుక్కపట్టి ఏడ్చిన కామాంధుడు

అతడు దొరికిపోవడంతో బోరున ఏడ్చాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఒక వ్యక్తి ప్రయాణించాడు. రోహిణి ప్రాంతంలో ఆ బస్సు వెళ్తుండగా మహిళా ప్రయాణికురాలికి ప్రైవేట్‌ భాగం చూపి అసభ్యంగా ప్రవర్తించాడు.

Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

New Delhi, JAN 05: బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు ఒక వ్యక్తి తన ప్రైవేట్‌ భాగాన్ని (flashes private part) చూపించాడు. అతడు దొరికిపోవడంతో బోరున ఏడ్చాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral video) అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC) బస్సులో ఒక వ్యక్తి ప్రయాణించాడు. రోహిణి ప్రాంతంలో ఆ బస్సు వెళ్తుండగా మహిళా ప్రయాణికురాలికి ప్రైవేట్‌ భాగం చూపి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC) మార్షల్‌కు దీని గురించి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. బీహార్‌కు చెందిన జకీర్‌గా (Jakeer) గుర్తించారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసి ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తామని డీటీసీ మార్షల్‌ తెలిపారు. మరోవైపు ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఇప్పటి వరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేయలేదని తెలిసింది.

అయితే ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. బాధితురాలిని సంప్రదించి ఆమె నుంచి ఫిర్యాదు లేదా స్టేట్‌మెంట్‌ తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, పట్టుబడిన నిందితుడు బోరున ఏడ్చిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.



సంబంధిత వార్తలు