Arvind Kejriwal Security Breach: కేజ్రీవాల్ స‌భ‌లో అజ్ఞాత వ్య‌క్తి హ‌ల్ చ‌ల్, స‌భా వేదిక ద‌గ్గ‌ర‌కు వెళ్లి నినాదాలు, ప‌ట్టుకున్న పోలీసులు, వైర‌ల్ వీడియో ఇదుగోండి!

ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికపైకి చేరుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆప్‌ కార్యకర్తలు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు.

Arvind Kejriwal Security Breach

New Delhi, OCT 06: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికపైకి చేరుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆప్‌ కార్యకర్తలు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో ‘జనతా కీ అదాలత్’ (jan Ki Adaalath) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. కాగా, సభకు హాజరైన వారిలో ఒక వ్యక్తి ఈ సందర్భంగా కలకలం సృష్టించాడు.

Here's the Video

ఉన్నట్టుండి ఆ వేదిక వద్దకు వెళ్లేందుకు (Arvind Kejriwal Security Breach) అతడు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్‌ కార్యకర్తలు అతడ్ని పట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్‌కు ఏదో చెప్పేందుకు ఆ వ్యక్తి సైగలు చేశాడు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బయటకు తరలించారు.

Chennai Air Show Stampede: చెన్నై ఎయిర్ షోలో విషాదం, ల‌క్ష‌లాది మంది త‌ర‌లిరావ‌డంతో తొక్కిస‌లాట‌, వంద‌లాది మందికి అస్వ‌స్థ‌త‌, ముగ్గురు మృతి 

మరోవైపు ఈ సంఘటన జరిగినప్పుడు ఢిల్లీ సీఎం అతిషి, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ వంటి ఆప్‌ ముఖ్య నేతలు ఆ వేదికపై ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now