Lucknow: 11 ఏళ్ల బాలిక ప్రైవేట్ పార్ట్స్ లో వేళ్లు పెట్టిన భూతవైద్యుడు, కర్రతో చితకబాదిన కుటుంబ సభ్యులు, వైరల్ వీడియో ఇదుగోండి
ఆకలిగా ఉందని వారితో చెప్పాడు. తినేందుకు ఎదైనా తెచ్చేందుకు పెద్దలు వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. తన కుటుంబానికి ఆమె చెప్పడంతో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ తాంత్రికుడ్ని చితకబాదారు
Lucknow, OCT 26: పొలంలో పని చేసుకునే కుటుంబం వద్దకు తాంత్రికుడు వెళ్లాడు. ఆకలిగా ఉందని వారితో చెప్పాడు. తినేందుకు ఎదైనా తెచ్చేందుకు పెద్దలు వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. తన కుటుంబానికి ఆమె చెప్పడంతో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆ తాంత్రికుడ్ని చితకబాదారు. (Tantrik Brutally Thrashed) ఉత్తరప్రదేశ్లోని మోహన్లాల్గంజ్లో ఈ సంఘటన జరిగింది. తాంత్రికుడు మేకు లాల్ బాబా కొన్నేళ్లుగా భూతవైద్యం చేస్తున్నాడు. గ్రామం వెలుపల ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. ఆ గ్రామంలో కొంత భూమి కూడా అతడికి ఉంది. కాగా, శుక్రవారం పొలాల్లో పంటలు కోసే కాంట్రాక్టు పని తీసుకున్న దంపతుల వద్దకు ఆ బాబా వెళ్లాడు. తనకు ఆకలిగా ఉందని తినేందుకు ఏదైనా ఇవ్వమని అడిగాడు. దీంతో ఆ దంపతులు 11 ఏళ్ల కుమార్తెను ఇంట్లో వదిలి సమోసాలు తెచ్చేందుకు వెళ్లారు. ఆ తర్వాత బాబా ఆ బాలికను తన గుడిసెలోకి తీసుకెళ్లాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Tantrik Brutally Thrashed by Locals
మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఆ బాలిక చెప్పింది. ఇది తెలిసి ఆ కుటుంబంతోపాటు గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. కర్రతో ఆ బాబాను చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ తాంత్రికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.