Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియా మీద చేయి చేసుకున్న మోహన్ బాబు, నా కూతురు లోపల ఉంది అంటూ గేట్లు నెట్టుకుని వెళ్లిన మంచు మనోజ్

జల్‌పల్లిలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తెలంగాణ ఏడీజీపీని కలిసిన అనంతరం మనోజ్‌ దంపతులు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేట్లు నెట్టుకొని బలవంతంగా లోపలికి ప్రవేశించారు.

Mohan Babu expressed his anger on the media

Hyd, Dec 9: జల్‌పల్లిలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తెలంగాణ ఏడీజీపీని కలిసిన అనంతరం మనోజ్‌ దంపతులు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో గేట్లు నెట్టుకొని బలవంతంగా లోపలికి ప్రవేశించారు.‘నా కుమార్తె లోపల ఉంది’ అంటూ మనోజ్‌ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే కాసేపు కారులోనే ఉండి.. ఆ తర్వాత గేట్లు బద్దలుకొట్టుకొని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్‌ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్‌ బయటకు వచ్చారు.

వీడియోలు ఇవిగో, మా జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తా, పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంచు మనోజ్ భార్య

ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్‌బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ప్రతినిధులపై ఆయన చేయి చేసుకున్నారు. మోహన్‌బాబు బౌన్సర్ల దాడిలో ఓ కెమెరామెన్‌ కిందపడ్డారు. విలేకరులను బయటకు నెట్టేసి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు.ఇదిలా ఉంటే పోలీసులతో ఫోన్‌లో మౌనిక వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు

‘‘మనోజ్‌కు గాయాలయ్యాయి. నా పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికొస్తే ప్రైవేట్ కేసు వేస్తా. మనోజ్‌ సెక్యూరిటీని తీసేస్తున్నారు. మా బౌన్సర్లను కానిస్టేబుళ్లు పంపించేశారు. వారినెలా బయటకు పంపుతారు? పోలీసులు న్యాయంగా వ్యవహరించాలి’’ అన్న మాటలు అందులో వినిపించాయి.తనపై దాడి జరిగిందంటూ మనోజ్‌.. పహాడీషరీఫ్‌ పోలీసులకు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు.. మనోజ్‌, మౌనికలపై రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత పరిస్థితి మరింత వివాదాస్పదమైంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement