Minor Raped by Producer: హీరోయిన్ అవకాశమిస్తానని రేప్ చేశాడు, తమిళనాడులో మైనర్‌పై సినీ నిర్మాత అత్యాచారం, గర్భందాల్చడంతో అబార్షన్ చేయించాడని ఆరోపణ, పరారీలో తమిళ నిర్మాత
స్పృహలోకి వచ్చిన తర్వాత తనను పెళ్లి పేరుతో మభ్యపెట్టాడని తెలిపింది. ఆపై సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తానని నమ్మించి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.
Chennai, SEP 16: తమిళనాడులో దారుణం జరిగింది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మహిళపై నిర్మాత (producer) పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను మైనర్‌గా (minor) ఉన్నప్పుడు పలుమార్లు అత్యాచారం చేశాడని కోయంబత్తూర్ పొల్లాచ్చి పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి (Chennai) చెందిన మహిళ 2019లో సినిమాలో హీరోయిన్ ఆఫర్‌కు (Heroin offer) సంబంధించిన ప్రకటనను చూసి నిర్మాతను సంప్రదించింది. నిర్మాతకు ఫోన్ చేయగా తనను ఆడిషన్ కోసం లాడ్జికి రావాలని కోరాడాని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. లాడ్జికి వెళ్లిన తర్వాత తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి నిర్మాత పార్తీబన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది.
2019 డిసెంబర్ 22న ఈ ఘటన జరిగిందని పేర్కొంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనను పెళ్లి పేరుతో మభ్యపెట్టాడని తెలిపింది. ఆపై సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తానని నమ్మించి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఓసారి తాను గర్భం దాల్చితే నిందితుడు బలవంతంగా అబార్షన్ (abortion) చేయించాడని పేర్కొంది. ఒత్తిడి చేయడంతో 2020 నవంబర్‌లో నిర్మాత పార్తీబన్ (parthiban) తనను వివాహం చేసుకున్నాడని చెప్పింది.
కోయంబత్తూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో 15 నెలలు కలిసి నివసించామని పేర్కొంది. ఆపై పార్తీబన్ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో చీటింగ్ కేసుతో పాటు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశానని తెలిపింది. మహిళ ఆరోపణలను పార్తీబన్ తోసిపుచ్చాడు. మహిళ పలుమార్లు తన దగ్గర డబ్బు తీసుకుని మోసగించిందని ఆరోపించాడు. కాగా, మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.