Representational Image | (Photo Credits: IANS)

Lakhimpur, Sep 15: యూపీలో లఖీంపురిలో అక్కాచెల్లెలపై జరిగిన ఘోర దారుణంతో (Lakhimpur Rape Murder Case) యావత్‌ యూపీ రగిలిపోతోంది. ఇద్దరమ్మాయిలపై హత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను ఇప్పటికప్పుడే ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. పైగా బాధితులు దళితులు కావడంతో యూపీ పోలీసులపై ఒత్తిడి మరింతగా పెరిగింది. నిందితులు సుహేయిల్‌, జునైద్‌, హఫీజుల్‌ రెహమాన్‌, కరీముద్దీన్‌, ఆరిఫ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు, బాధితుల పక్కింట్లో ఉండే చోటును సైతం అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం బ్రజేష్‌ పాథక్‌ స్పందించారు. దళిత మైనర్ బాలికలపై అత్యాచారంచేసి, వారిని హత్య (Lakhimpur Kheri Murder Case)చేసినవారిని కఠినంగా శిక్షిస్తామని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ (Brajesh Pathak) గురువారం చెప్పారు. రాబోయే తరాలు సైతం వణికిపోయే విధంగా (Punishment that generations will remember) వీరిని శిక్షిస్తామని చెప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

 స్నేహితుడే అసలు సూత్రధారి, యూపీలో అక్కాచెళ్లెల్లపై అత్యాచారం, హత్య కేసులో ఆరుమంది అరెస్ట్, చెరుకుతోటకు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారని తేల్చిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు (UP Police) తెలిపిన వివరాల ప్రకారం, లఖింపూర్ జిల్లాలో ఇద్దరు దళిత మైనర్ అక్కచెల్లెళ్ళపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, వారిని చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. వీరిద్దరి మృతదేహాలను బుధవారం గుర్తించారు. అక్కచెల్లెళ్ళిద్దరికీ నిందితులతో బాగా పరిచయం ఉందని, ఇష్టపూర్వకంగానే నిందితులతో కలిసి మోటార్ సైకిళ్ళపై వెళ్ళారని పోలీసులు చెప్పారు. లఖింపూర్ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ సుమన్ గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బాధిత బాలికలు, నిందితులు స్నేహితులని తెలిపారు.

జునెయిద్, సొహెయిల్ బుధవారం మోటారు సైకిల్‌పై ఈ బాలికల ఇంటికి వెళ్ళి, వారిని తీసుకెళ్ళారన్నారు. ఆ బాలికలను నిందితులు అపహరించలేదని, ఇష్టపూర్వకంగానే వారు వెళ్ళారని తెలిపారు తమను పెళ్లి చేసుకోవాలని సొహెయిల్, జునెయిద్‌లను వారు కోరడంతో, వారిపై అత్యాచారం చేసి, ఉరి తీసి చంపేశారని చెప్పారు. ఈ బాలికల ఇంటికి పొరుగింట్లో ఉంటున్న ఛోటు ఈ ఇద్దరినీ మిగిలిన నిందితులకు పరిచయం చేశాడని చెప్పారు. ఛోటును కూడా అరెస్టు చేశామన్నారు.

కానీ బాధిత కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెలను ఈ నిందితులు అపహరించి, తీసుకెళ్ళారని ఆరోపించారు. ఈ అక్కచెల్లెళ్ళ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఛోటు తన స్నేహితులతో కలిసి తమ ఇంట్లోకి అక్రమంగా చొరబడి, తనను కొట్టి, తమ కుమార్తెలిద్దరినీ బలవంతంగా లాక్కెళ్ళారని తెలిపారు.

మరోవైపు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.శవపరీక్షలో మైనర్లపై అఘాయిత్యం జరిగిందని, చెరుకు తోటలో ఇద్దరమ్మాయిలపై సుహేయిల్‌, జునైద్‌లు రేప్‌కి పాల్పడగా.. మిగతావాళ్లు ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఎస్పీ సంజీవ్‌ సుమన్‌ వెల్లడించారు. వాళ్ల దుపట్టాలతోనే ఉరేశారని, ఆపై చెరుకుతోటలోనే ఓ చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఎస్పీ అన్నారు.

బాధితురాలి తండ్రి గురువారం "నేరస్థులను ఉరితీయాలి" అని పేర్కొంటూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా కూతుళ్లను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారం చేసి హత్య చేశారు. నేను న్యాయం కోరుతున్నాను, దోషులను ఉరితీయాలి, ”అని బాధితుల తండ్రి అన్నారు.పోలీసుల చర్యను కూడా ప్రశ్నించి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.