Miscreants Vandalize Hanuman Temple in Hyderabad: హిందూ ఆలయాలపై కొనసాగుతున్న దాడులు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాల ధ్వంసం

హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయంపై జరిగిన దాడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ ఘటనను మరిచిపోకముందే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

Vandalize Hanuman Temple (Credits: X)

Hyderabad, Nov 5: హిందూ ఆలయాలపై (Hindu Temples) దాడులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయంపై జరిగిన దాడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ ఘటనను మరిచిపోకముందే హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై (Hanuman Temple) గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మంగళవారం ఉదయం దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు పగులగొట్టారు. ఉదయాన్నే పూజ కోసం వచ్చిన అయ్యప్ప స్వాములు విగ్రహాల ధ్వంసాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ దాడికి పాల్పడ్డ నిందితులను పట్టుకుంటామని అన్నారు.

బావమరిది నిశ్చితార్థంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

ఉద్రిక్త పరిస్థితి

విషయం తెలుసుకున్న స్థానికులు భారీ స్థాయిలో దేవాలయం వద్దకు చేరుకుంటున్నారు. నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మళ్ళీ పెళ్లి చేసుకున్న శృంగార తార సన్నీ లియోన్, తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన ఫోటోలు వైరల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement