Madhya Pradesh Murder: ప్రియుడి సుఖం కోసం హత్య చేసిన లవర్, ఇద్దరు భార్యలున్నా కూడా మరో యువతితో ఎఫైర్, అడ్డొస్తుందని రెండో భార్యను హత్య చేయించిన భర్త, మధ్యప్రదేశ్‌లో ఘటన

ప్రియుడి సమస్య పరిష్కారం కోసం, అతడి రెండో భార్యను ప్రియురాలు (lover) హత్య చేసింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో (Dewas) ఈ సంఘటన జరిగింది. బబ్లూ (Bablu) అనే వ్యక్తికి 14 ఏళ్ల కిందట నీలం అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. అయితే ఈ ఏడాది మే నెలలో రాణి (Rani) అనే మహిళను అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు.

Representational Image. (photo credit- IANS)

Bhopal, AUG 12: ప్రియుడి సమస్య పరిష్కారం కోసం, అతడి రెండో భార్యను ప్రియురాలు (lover) హత్య చేసింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో (Dewas)  ఈ సంఘటన జరిగింది. బబ్లూ (Bablu) అనే వ్యక్తికి 14 ఏళ్ల కిందట నీలం అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. అయితే ఈ ఏడాది మే నెలలో రాణి (Rani) అనే మహిళను అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆ దంపతుల మధ్య సమస్యలు మొదలయ్యాయి. మరోవైపు జ్యుయలరీ షాపులో పని చేసే రీతూ గౌర్ అనే వివాహితతో కూడా బబ్లూకు సంబంధం ఉంది. ఆరేళ్ల కిందట జ్యుయలరీ షాపులో కొనుగోలు సందర్భంగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఏడేళ్ల కుమార్తె కూడా ఉన్న ఆమె ఇంటికి బబ్లూ తరచుగా వెళ్లేవాడు. రెండో భార్య వల్ల కుటుంబంలో తలెత్తిన సమస్యను ఇటీవల రీతూ వద్ద ప్రస్తావించాడు. ఆమెను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానంటూ వాపోయాడు.

Talasani Dance Video: డీజే టిల్లు సాంగుకు డ్యాన్స్ వేసిన మంత్రి తలసాని, కాలు కదపకుండానే చేతులతో డ్యాన్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ 

కాగా, ప్రియుడు బబ్లూను ఓదార్చిన ప్రియురాలు రీతూ, అతడి రెండో భార్య రాణి అడ్డుతొలగిస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో మరో మహిళతో కలిసి జాకెట్‌ కుట్టించుకునే నెపంతో రాణి ఇంటికి వెళ్లింది. ఆమె గొంతునులిమి హత్య చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఇంటికి వచ్చిన బబ్లూ, మరణించిన రెండో భార్య రాణిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె ఉన్నట్టుండి అస్వస్థతకు గురైందని చెప్పాడు.

West Bengal: పానీ పూరి తిన్న 100 మందికి వాంతులు, విరేచనాలు, నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా అనుమానిస్తున్న వైద్యులు, ప‌శ్చిమ బెంగాల్‌లో ఘటన 

అయితే గొంతు నొక్కి ఆమెను హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. బబ్లూను పోలీసులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. దీంతో అతడితోపాటు ప్రియురాలు రీతూ, ఆమెకు సహకరించిన మరో మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement