Kolakata, August 11: పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో పానీ పూరి తిని వంద మందికి పైగా అస్వస్ధతకు (100 People Fell Sick) గురయ్యారు. సుగంధ గ్రామంలోని డొగచియ ప్రాంతంలోని ఓ దుకాణంలో పానీపూరి తిన్న తర్వాత (Eating Pani Puri) వీరంతా అనారోగ్యానికి లోనయ్యారు. వారిలో డయేరియా లక్షణాలు కనిపించాయి.నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా వైద్యులు అనుమానిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని ఔషధాలు అందించారు. పలువురు తీవ్రంగా ప్రభావితమైన క్రమంలో ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అస్వస్థతకు గురైన వారిలో డొగచియా, బహిర్ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపగా రోగులకు మందులు అందించారు. తీవ్ర అస్వస్దతకు లోనైన వారిని ఈ బృందం గుర్తించి ఆస్పత్రుల్లో చేర్పించింది. స్ట్రీట్ స్టాల్‌లో పానీపూరి తిని అస్వస్ధతకు గురైన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.