UP cop breaks down over mess food (Photo-Video Grab)

Lucknow, August 11: యూపీలో తమకు పెడుతున్న భోజనంపై ఓ కానిస్టేబుల్ భోరున విలపించాడు. తమకు ఇచ్చే ఆహారాన్ని జంతువులు కూడా తినలేవని (Even animals won’t eat this) ఆరోపించాడు. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో బుధవారం ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్‌ మనోజ్ కుమార్ అక్కడి మెస్‌ ఫుడ్‌పై ఆవేదన వ్యక్తం చేశాడు. రోటీలు, దల్‌ ప్లేట్‌ పట్టుకున్న అతడు దానిని అక్కడున్న వారికి చూపించి బోరున (UP cop breaks down over mess food) విలపించాడు.

రోడ్లు బాగు చేయమంటే పట్టించుకోని అధికారులు, ఎమ్మెల్యే ముందే బురద నీటిలో స్నానం చేసిన ఓ వ్యక్తి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

రోటీలను సరిగా కాల్చలేదని, పప్పు నీళ్ల లాగా ఉందని, అన్నం ఉడకలేదని ఆరోపించాడు.సరైన ఆహారం లేకపోతే పోలీసులు ఎలా డ్యూటీ చేస్తారు? అని ప్రశ్నించాడు. మెస్‌ ఫుడ్‌ నాణ్యతను ప్రశ్నించినందుకు జాబ్‌ నుంచి తొలగిస్తామంటూ తనను బెదిరిస్తున్నారని ఆరోపించాడు. అయితే అక్కడున్న పోలీస్‌ అధికారి విలపిస్తున్న ఆ కానిస్టేబుల్‌ను సముదాయించేందుకు ప్రయత్నించాడు.కాగా పోలీసు సిబ్బందికి పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భృతిని అందజేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గతంలో ప్రకటించారంటూ కానిస్టేబుల్‌ మనోజ్ కుమార్ గుర్తు చేశాడు.

Here's Video

మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఫిరోజాబాద్ పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించారు. కానిస్టేబుల్‌ మనోజ్ కుమార్‌ తరచుగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అతడి అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించి గతంలో 15 సార్లు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తాజా ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.