Malappuram protested against potholes on roads in a unique way by bathing & performing yoga (Photo-ANI)

Malappuram, August 11: రోడ్లు మరమ్మత్తు చేయలేదని కేరళలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు.ఇటీవల కురిసిన వ‍ర్షానికి మలప్పురం ప్రాంతంలోని రోడ్లపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. అయితే దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఓ వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగాడు. స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్ ముందు ఎమ్మెల్యే ఎదురుగానే గుంతల్లోని నీటిలో స్నానం చేశాడు. లోకల్ ట్రైన్లో దారుణం, ఫ్యాంట్ జిప్ విప్పి పురుషాంగాన్ని మహిళ వెనుక భాగాలకు తగిలించిన కామాంధుడు,నిందితుడిని చితకబాదిన ప్రయాణికులు

ఎమ్మెల్యే కారు సంఘటనా స్థలానికి చేరుకోగానే గుంతలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. బురద నీటిలో యోగా చేశాడు. చెప్పులు శుభ్రం చేసుకొని, బట్టలు కూడా ఉతుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తిని హంజా పోరాలిగా గుర్తించారు.

కాగా వారం రోజుల్లోగా తమ ఆధీనంలోని ప్రతి రోడ్డును బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది.