MP Shocker: తల్లి వెంట అడవికి వెళ్లిన బాలికపై విరుచుకుపడిన కామాంధులు, రేప్ చేసి చెట్టుకు ఉరేసి చంపేశారు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో అమానుష ఘటన
12 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం చెట్టుకు ఉరేసి (Girl Found Hanging With Her Hands) చంపేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.
Bhopal, August 4: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 12 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం చెట్టుకు ఉరేసి (Girl Found Hanging With Her Hands) చంపేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బాలిక తల్లి సమీప అడవిలోకి వెళ్లింది. తల్లిని అనుసరిస్తూ బాలిక కూడా వెళ్లింది. అయితే తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించలేదు.
దీంతో తమ బిడ్డ తప్పిపోయిందని గ్రామస్తులకు తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని గంటల పాటు అడవిలో ఆ బిడ్డ కోసం గాలింపు చేశారు. చివరకు ఓ చెట్టుకు బాలిక వేలాడుతూ ఉండటాన్ని చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఆమె చేతులు కట్టేసి ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి ఉరేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం (Police Suspect Murder After Rape) జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
మైనర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఒక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదిశలోని అటవీ ప్రాంతానికి తన తల్లితో కలిసి వెళ్తున్నానని తన తండ్రికి చెప్పిందని అయితే బాధితురాలు ఉదయం 11 గంటల వరకు తన ఇంట్లోనే ఉందని విదిశ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వినాయక్ వర్మ తెలిపారు. బాధితురాలి తల్లి తన కూతురు తనను అడవిలో అనుసరిస్తోందనే విషయం తనకు తెలియదని చెప్పింది.
తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తన కూతురు తనతో పాటే అడవికి వస్తుందని తనకు తెలియదని ఆమె భర్తకు చెప్పింది. ఆ తర్వాత గ్రామస్తులు బాలికను వెతకడానికి అడవికి బయలుదేరారు. అడవిలో చిన్నారి మృతదేహం వేలాడుతూ కనిపించింది. బాలిక చేతులు కట్టేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తరువాత, గ్రామానికి చెందిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"మేము గ్రామంలోని ఒక యువకుడిని మా అదుపులోకి తీసుకున్నాము. అతడిని ప్రశ్నిస్తున్నారు. అతను అనుమానాస్పదంగా ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించారు. అతని చెప్పిన దానిలో చాలా అనుమానాలున్నాయని అన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం మేము ఎదురుచూస్తున్నామని పోలీసులు చెప్పారు.