Mumbai Private Jet Accident: ముంబై విమానాశ్రయంలో ప్రమాదం, భారీ వర్షాలకు రన్‌వేపై జారి పక్కకు దూసుకెళ్లిన విమానం, విమానంలో ఆరుగురు ప్రయాణికులతో సహా ఇద్దరు సిబ్బంది
దేశ ఆర్థిక రాజధానిలో ముంబయిలో గల ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయం (Mumbai Airport)లో ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి ముంబయికి బయల్దేరిన వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన ఓ ప్రైవేటు బిజినెస్ విమానం (Learjet 45) ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై జారి పక్కకు దూసుకెళ్లింది.
Mumbai, Sep 14: దేశ ఆర్థిక రాజధానిలో ముంబయిలో గల ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయం (Mumbai Airport)లో ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి ముంబయికి బయల్దేరిన వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన ఓ ప్రైవేటు బిజినెస్ విమానం (Learjet 45) ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై జారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
ఈ ఘటనలో విమానం దెబ్బతినగా, పైలట్లు సహా ముగ్గురికి గాయాలైనట్లు సహాయక చర్యల సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, 700 మీటర్లకు మించి దృశ్యగోచరత లేదని డీజీసీఏ వెల్లడించింది. విమానాశ్రయంలో గల రన్‌వే 27పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన నేపథ్యంలో రన్‌వేను కొద్దిసేపు మూసేశారు. ఆ సమయంలో డెహ్రాదూన్ నుంచి ముంబయికి చేరుకోవాల్సిన విస్తారా విమానాన్ని గోవాలోని మోపా విమానాశ్రయానికి మళ్లించారు. సహాయక చర్యల అనంతరం రన్‌వే కార్యకలాపాలను పునరుద్ధరించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)