Mumbai Shocker: ముంబైలో దారుణం, డాక్టర్‌కు మందు తాగించి సృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం, అనంతరం డబ్బు కోసం బ్లాక్ మెయిల్

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టార్డియో ప్రాంతంలోని క్లబ్‌లో బ్యాడ్మింటన్ సెషన్స్‌లో నిందితుడు తనతో స్నేహం పేరుతో నాపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఫిర్యాదుతో దక్షిణ ముంబైలోని గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.

Representative Image (Photo Credit- PTI)

ముంబై, నవంబర్ 16 : ముంబైలో డాక్టర్‌పై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేసినందుకు 38 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టార్డియో ప్రాంతంలోని క్లబ్‌లో బ్యాడ్మింటన్ సెషన్స్‌లో నిందితుడు తనతో స్నేహం పేరుతో నాపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఫిర్యాదుతో దక్షిణ ముంబైలోని గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహిత అయిన మహిళ ఈ సమయంలో కొన్ని గృహ సమస్యల కారణంగా భర్తతో కలిసి జీవించడం లేదు. ఈ విషయంపై ఆ వ్యక్తి తనతో మాట్లాడేందుకు ముందుకొచ్చాడని, అయితే తనను కలిసేందుకు వెళ్లినప్పుడు నిందితుడు తనకు మద్యం తాగించాడని, ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయానని, అతను నాపై అత్యాచారం చేశాడని ఫిర్యాదుదారు ఆరోపించింది.

బెంగుళూరులో లెక్చరర్‌ దారుణం, ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతిపై అత్యాచారం, వీడియో తీసి మళ్లీ మళ్లీ రావాలంటూ బ్లాక్ మెయిల్

అక్టోబరులో, అతను డబ్బు కోసం ఆమెను అడిగాడు; ఆమె డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఇద్దరం కలిసి ఉన్న ఫోటో, వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని ఫిర్యాదులో తెలిపింది. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (రేప్), 384 (దోపిడీ) కింద ఆ వ్యక్తిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif