No Relief for Manish Sisodia: మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురు, కీలక సాక్షాధారాలను నాశనం చేశారని వ్యాఖ్యానించిన కోర్టు
ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిల్ (Bail) ఇవ్వాలని మనీశ్ సిసోడియా పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది.
New Delhi, May 21: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు (Manish Sisodia) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిల్ (Bail) ఇవ్వాలని మనీశ్ సిసోడియా పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేశాడని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అంతకు ముందు దిగువ న్యాయస్థానం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ ను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.