Novel Coronavirus Row: చైనాలో వేగంగా విస్తరిస్తున్న నోవెల్ కరోనా వైరస్, అప్రమత్తమైన భారత్, అన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రాయాలలో స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు
2000 ఏడాది ప్రారంభంలో సార్స్ వైరస్ విస్తరించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు....
New Delhi, January 23: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన నోవెల్ కరోనా వైరస్ (Novel Coronavirus or nCoV) వారి దేశంలో వేగంగా విస్తరిస్తుంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా (China) వెళ్లి వచ్చిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. ఇప్పటివరకు చైనా లోపల మరియు చైనా వెలుపల కలిపి 571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలలో (International Airports) స్క్రీనింగ్ సెంటర్లను కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముంబై, న్యూ ఢిల్లీ మరియు కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయాలలో మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనా వైరస్ మొదటి కేసు చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో, అక్కడే దాదాపు 500 మంది భారతీయ విద్యార్థులు
విమానాశ్రాయాల్లో విధులు నిర్వహించే అధికారులందరికీ ప్రత్యేక ఫేస్ మాస్క్‌లు మరియు చేతి గ్లౌజులు పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు 43 అంతర్జాతీయ విమానాల నుంచి ఇండియాలో ల్యాండ్ అయిన 9,156 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించామని, అయితే భారత్ (India) లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవే కాకుండా, nCoVకి సంబంధించి అన్ని రాష్ట్రాలలోని ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రిత్వ శాఖ సూచనలు జారీచేసింది.
Statement by Health Secretary Preeti Sudan:
వివిధ ఏజెన్సీల నివేదికల ప్రకారం చైనాలో కరోనావైరస్ ప్రభావంతో 440 న్యుమోనియా కేసులు నిర్ధారించబడ్డాయి, తైవాన్ ద్వీపంలో 14 కేసులు నమోదయ్యాయి. ఈ కరోన వైరస్ వ్యాధి లక్షణాలు గతంలో చైనా ద్వారా విస్తరించిన తీవ్రమైన శ్వాస సంబంధ ఇబ్బందులు కలిగిచే 'సార్స్' లక్షణాలకు దగ్గరగా ఉంది. 2000 ఏడాది ప్రారంభంలో సార్స్ వైరస్ విస్తరించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు.