Banks Closing Down Reports: బ్యాంకులను మూసివేయడం లేదు! బ్యాంకుల మూసివేతపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్
దీంతో...
New Delhi, September 25: సెంట్రల్ బ్యాంకింగ్ సంస్థ కొన్ని వాణిజ్య బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెప్టెంబర్ 25 బుధవారం స్పష్టం చేసింది. పంజాబ్- మహారాష్ట్ర కోఆపరేటివ్ (PMC Bank) బ్యాంకులో పలు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ బ్యాంకుపై ఆర్బీఐ 6 నెలల పాటు ఆంక్షలు విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ బ్యాంకు ఖాతాదారులకు రోజుకు రూ. 1,000 మించి నగదు ఉపసంహరణ చేసుకునే వీలు లేకుండా పోయింది.
ఈ చర్య తర్వాత, ఆ మరుసటి రోజు ఆర్బీఐ బ్యాంకులను మూసివేస్తుంది, వెంటనే మీ ఖాతాలో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకోండంటూ సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కల్పించుకొని కల్పిత వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టింది.
Teet by RBI:
ఈ పుకార్లపై స్పందిస్తూ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, "ఆర్బీఐ కొన్ని బ్యాంకులను మూసివేస్తుందంటూ సోషల్ మీడియాలో కొంటె పుకార్లు వ్యాపిస్తున్నాయి. ప్రజల విశ్వాసం పొందిన ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు, అయితే ఖాతాదారులకు మెరుగైన సేవలందించేలా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చి వాటి మూలధనం పెంచేలా PSBలను బలోపేతం చేస్తుంది." అని చెప్పుకొచ్చారు.