Rajasthan Shocker: దారుణం.. ప్రియురాలిని చంపేసి ఆ శవంపై పడుకుని..పెళ్లైన తరువాత తనతో సంబంధం వద్దందనే కోపంతో వివాహితను నరికేసిన కిరాతకుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

వివాహితపై కోపం పెంచుకున్న అతడు శాంతిదేవి ఎక్కడుంటుందో విషయం తెలుసుకున్న ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లాడు.పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి (Stalker Allegedly Kills Woman in Jalore) చెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని హత్తుకొని అక్కడే ఉండిపోయాడు.

Crime | Representational Image (Photo Credits: Pixabay)

Jaipur, October 25: వివాహితకు పెళ్లైందని, తనకు దక్కలేదన్న కోపంతో ప్రియుడు దారుణంగా హత్య (Rajasthan Shocker) చేసిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. జలోర్‌ జిల్లాలో గల అహోర్ పట్టణం పక్కన థన్వా గ్రామంలో శాంతిలాల్ చౌదరి, శాంతి దేవి(32ఏళ్లు) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త శాంతిలాల్ చౌదరి పని నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడే ఉంటూ ఇంటికి డబ్బులు పంపిస్తుంటాడు.

పెళ్లికి ముందే గణేశ్‌రామ్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. క్రమంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ వీరి ప్రేమను (Love) పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆమెను శాంతిలాల్ చౌదరికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తరువాత నుంచి ఆమె ప్రియుడ్ని (Lover) దూరం పెడుతూ వచ్చింది. అయితే యువతికి పెళ్లైన తరువాత కూడా ఆమెతో సంబంధం పెట్టుకోవాలని ప్రియుడు కోరాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో వివాహితపై కోపం పెంచుకున్న అతడు శాంతిదేవి ఎక్కడుంటుందో విషయం తెలుసుకున్న ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లాడు.

చెల్లిపై అక్క ప్రియుడు దారుణంగా అత్యాచారం, ఆపై హత్య, తోడబుట్టిన అక్కే ప్రధాన నిందితురాలు, జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన

పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి (Stalker Allegedly Kills Woman in Jalore) చెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని హత్తుకొని అక్కడే ఉండిపోయాడు. అహోర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తన్వాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని మృతదేహం నుంచి వేరు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement